సమాజంలో కొంత మంది మహిళలు ఆడతనానికే మచ్చ తీసుకొచ్చే పనులు చేస్తారు. సాటి మహిళలను, బాలికలపై దారుణాలకు పాల్పడుతుంటారు. కొన్ని చోట్ల.. అత్తలు.. కోడళ్లను వేధిస్తుంటారు. సూటి పోటి మాటలతో వేధిస్తూ.. వారిని శారీరకంగా, మానసికంగాను హింసిస్తుంటారు. మరికొందరు.. సమాజంలో ఎవరి ఆసరాలేని యువతులకు మాయమాటలు చెబుతుంటారు. వారి మనస్సులో చెడు భావాలను నింపుతారు. డబ్బుల కోసం వారిచేత నీచమైన పనులు కూడా చేయిస్తారు.
కొన్ని చోట్ల.. ఆడవారికే ఆడవాళ్లకు పడదు. ఈ క్రమంలో వారు.. ఎంతటి దారుణాలకైన తెగబడుతారు. కొన్ని చోట్ల మగాళ్లు... వివాహేతర సంబంధాలు (Extramarital affair) పెట్టుకుంటారు. దీన్ని తప్పని చెప్పి సర్ది చెప్పాల్సిన భార్యలే.. అమానవీయంగా ప్రవర్తిస్తుంటారు. పక్కనుండి.. భర్తతో తప్పులు చేయిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar pradesh) దారుణమైన ఉదంతం వెలుగులోనికి వచ్చింది. బదౌన్ లో జూలై 12 న జరిగిన సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసుల ప్రకారం... బదౌన్ గ్రామంలోని ఫైజ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. ఒక జంట ఉండేవారు. వీరి ఇంటి పక్కన బాలిక ఉంటుంది. తెలిసిన వారే కావడంతో తరచుగా వీరి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో.. మహిళ భర్త.. బాలికపై పడింది. ఆమెను అత్యాచారం చేయాలనుకున్నాడు. ఒక రోజు.. భార్యతో బాలికను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెను గదిలో బంధించి అత్యాచారంచేశాడు. భర్త.. బాలికను అత్యాచారం చేస్తుండగా.. భార్య పక్కనే ఉండి రికార్డు చేసింది.
ఆ తర్వాత.. విషయాన్ని ఎవరికైన చెబితే.. వీడియో (Video) సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. కొన్ని రోజుల తర్వాత... నిందితులు చెప్పినట్లుగానే వీడియోను ఇంటర్నేట్ లో (Social media) అప్ లోడ్ చేశారు. దీంతో బాలిక.. భయపడిపోయింది. తన ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని రోజులుగా బాలిక ప్రవర్తనలో మార్పులు ఉండటంతో తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన దారుణం బయట పడింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యభర్తలిద్దరిని అరెస్టు చేశారు. బాలికను టెస్ట్ ల కోసం ఆస్పత్రికి తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Female harassment, Uttar pradesh