హోమ్ /వార్తలు /క్రైమ్ /

Adibatla Kidnap Case: 100 మందితో యువతి కిడ్నాప్.. పోలీసుల పట్టించుకోలేదని బంధువుల ఆగ్రహం

Adibatla Kidnap Case: 100 మందితో యువతి కిడ్నాప్.. పోలీసుల పట్టించుకోలేదని బంధువుల ఆగ్రహం

రోదిస్తున్న యువతి కుటుంబసభ్యులు

రోదిస్తున్న యువతి కుటుంబసభ్యులు

Telangana: కొద్దిరోజుల నుంచి ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తాము తీసుకెళ్లామని..అయినా పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదని మండిపడుతున్నారు. మరోవైపు కిడ్నాప్ అయిన యువతి ఇంటికి మరికాసేపట్లో డీసీసీ చేరుకోనున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో యువతి కిడ్నాప్(Kidnap) అంశం కలకలం రేపుతోంది. కొన్ని గంటల క్రితం యువతి వైశాలి కిడ్నాప్ జరిగిందని..వంద మంది యువకులు వచ్చి తమపై దాడి చేసి తమ అమ్మాయిని తీసుకెళ్లారని యువతి తరపున బంధువులు ఆరోపించారు. దీనిపై పోలీసులు(Police) ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యువతి, ఆమెను కిడ్నాప్ చేసిన నిందితుల కోస గాలింపు చేపట్టారు. అయితే పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని యువతి తరపున బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగే సమయంలో తాము డయల్ 100కు ఫోన్ చేశామని అన్నారు.

అయితే పోలీసులు ఎవరూ ఇటు వైపు రాలేదని ఆరోపించారు. ఆదిభట్ల సీఐ, ఎస్‌ఐ నిందితుడు నవీన్ రెడ్డికి సహకరించారని యువతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సాగర్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఆగ్రహంతో నిందితుడు నవీన్ రెడ్డికి చెందిన టీ స్టాల్‌కు నిప్పుపెట్టారు యువతి బంధువులు.

కొద్దిరోజుల నుంచి ఈ వ్యవహారాన్ని పోలీసుల దృష్టికి తాము తీసుకెళ్లామని..అయినా పోలీసులు తమ ఫిర్యాదును పట్టించుకోలేదని మండిపడుతున్నారు. గతంలో నవీన్‌రెడ్డి, యువతికి పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు బాధితుల ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి వేడుకలో ఘోర విషాదం..పేలిన గ్యాస్ సిలిండర్ ..ఐదుగురు సజీవదహనం

Trending: పోలీస్ స్టేషన్‌కు చేరిన వధువు మేకప్ పంచాయతీ.. రూ. 3 వేలకు అలా మేకప్ చేయలేనంటూ..

మరోవైపు కిడ్నాప్ అయిన యువతి ఇంటికి మరికాసేపట్లో డీసీసీ చేరుకోనున్నారు. ప్రస్తుతం ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల ఇంట్లో పలు చోట్ల రక్తపు మరకలను గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు10 కార్లు ధ్వంసమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతిని తీసుకెళ్లిన యువకుడు నవీన్ రెడ్డి మిస్టర్ టీ టైం ఓనర్‌గా తెలుస్తోంది.

First published:

Tags: Crime, Telangana

ఉత్తమ కథలు