ఆమెను పొడిచి... 8వ అంతస్థు నుంచీ దూకేశాడు... ఎందుకంటే...

Noida : దేశంలో వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో నోయిడా ఒకటి. అక్కడ అభివృద్ధితోపాటూ... నేరాలూ ఎక్కువవుతున్నాయి. ఈ కేసులో ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 18, 2019, 7:42 AM IST
ఆమెను పొడిచి... 8వ అంతస్థు నుంచీ దూకేశాడు... ఎందుకంటే...
ప్రతీకాత్మక చిత్రం (credit - twitter - ⚡ Life & Death Meditation Society)
  • Share this:
నోయిడాలోని సెక్టార్ 61లో జరిగిందీ ఘటన. వయసు అంతా కలిపి 15 సంవత్సరాలు. ఆ కుర్రాడు... 21 ఏళ్ల యువతిని కత్తితో పొట్టలో పొడిచి... 8వ అంతస్థులోని ఫ్లాట్ బాల్కనీ నుంచీ కిందకు దూకేశాడు. స్థానికులు ఇద్దర్నీ ఆస్పత్రికి తరలించారు... అప్పటికే ఆ కుర్రాడు చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. ఆమె ప్రస్తుతం ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది. ఆ యువతీ, ఆ కుర్రాడు ఇద్దరూ సెక్టార్ 61లోని వేర్వేరు హౌసింగ్ సొసైటీల్లో ఉంటున్నారు. ఆమె ఘజియాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. ఆ కుర్రాడు నోయిడాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు... ఆమెకు ఆపరేషన్ తర్వాత... ఎంక్వైరీ చేశారు. ఎలా జరిగిందని అడిగారు.

ఆ కుర్రాడు సాయంత్రం 5 గంటలకు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కి వెళ్లాడు. అతని చేతిలో కిచెన్‌లో వాడే కత్తి ఉంది. తిన్నగా ఆమె ఉండే ఫ్లాట్‌కి వెళ్లాడు. కత్తిని ఎక్కడ పెట్టాలో తెలియదన్నట్లుగా ఆమెను చూస్తూ... ఆమె పొట్టలో గుచ్చాడు. ఆమె గట్టిగా అరిచింది. వెంటనే పక్క రూంలోకి వెళ్లి తలుపు వేసేసుకున్నాడు. లోపల గడియ పెట్టుకున్నాడు.

ఆమె అరుపులు విన్న పక్కింటివాళ్లు పరిగెత్తుకొని వచ్చారు. వాళ్లకు విషయం చెప్పి... కింద పడిపోయింది. ఆ కుర్రాడు ఏ రూంలోకి వెళ్లాడో వేలితో చూపించింది. అంతలో "దబ్" మని పెద్ద శబ్దం. బయట ఏవో అరుపులు. పక్కింటివాళ్లు... గబగబా ఆ ఫ్లాట్‌ నుంచీ కిందకు చూశారు. కింద శవంలా రక్తపు మడుగులో పడివున్న కుర్రాడు కనిపించాడు. చుట్టూ జనం మూగారు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పిందామె.

ఈ ఘటన జరిగినప్పుడు... ఆమె పేరెంట్స్ ఇంట్లో లేరు. అసలా కుర్రాడు ఆమెను ఎందుకు పొడిచాడన్నది పోలీసులకే తెలియట్లేదు. బాధితురాలిని ఈ సమయంలో ప్రశ్నలతో వేధించడం కరెక్టు కాదనుకున్న పోలీసులు... ఆమెను రెస్ట్ తీసుకోమని చెప్పారు. కుర్రాడి తల్లిదండ్రులు కూడా షాక్ లోనే ఉన్నారు. తను అలా ఎందుకు చేశాడో తమకూ అర్థం కావట్లేదంటూ తలలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఆమెకు కాస్త నయం అయ్యాక... అప్పుడు ఎంక్వైరీ చేస్తామని పోలీసులు అంటున్నారు. 

Pics : అందం, అభినయాల కలయిక ప్రియాంక నల్కర్

ఇవి కూడా చదవండి :


పవన్‌కళ్యాణ్ ప్లానేంటి... నేడు జనసేన పొలిట్‌బ్యూరో మీట్...

Health Tips : రోజా పూలతో చక్కటి ఆరోగ్యం... ఇలా చెయ్యండి


Health Tips : వేరుశనగ గింజలను ఇలా తింటే ఎక్కువ ప్రయోజనాలు

ఇంటికి ఎలాంటి కలర్స్ వేస్తే మంచిది... కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

ఇంట్లో నెమలి పించం ఉందా... మీకు కలిగే ప్రయోజనాలు ఏవంటే...
First published: October 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>