రేప్ చేయబోయి, గొంతు నులిమి... నాలుగేళ్ల బాలికపై టీనేజర్ దారుణం

ప్రతీకాత్మక చిత్రం

ఈ రోజుల్లో పిల్లల్ని కాపాడుకోవడం తల్లిదండ్రులకు కష్టమైపోతోంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా... ఎప్పుడోకప్పుడు అక్రమార్కుల కళ్లు పిల్లలపై పడుతున్నాయి. అత్యాచారాల అడ్డాలా మారుతున్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణం ఇది.

  • Share this:
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఆ కుటుంబం తమ చిట్టితల్లి కోసం వెతుకుతోంది. సాయంత్రం వరకూ అక్కడే ఉన్న పాప... ఏమైపోయిందో వాళ్లకు అర్థం కాలేదు. ఆ ఇల్లూ... ఈ గడపా... వెతుకుతూ ఉంటే... ఎక్కడి నుంచో ఏడుపు వినిపించింది. ఆ దిశగా వెళ్తే... చెరుకు తోట లోపలి నుంచీ పాప ఏడుపు వినిపించింది. గబగబా వెళ్లి చూసిందా తల్లి. ఒక్కసారిగా షాకైంది. పాప ఒంటిపై బట్టలు లేవు. తీవ్ర గాయాలతో ఉంది. అయ్యో నా బంగారు తల్లి ఇలా అయిపోయిందేంటంటూ... ఆఘ మేఘాలపై ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే చాలా రక్తం కారిపోయిందన్న పోలీసులు... తమ ప్రయత్నం తాము చేస్తామంటూ... ఐసీయూలో ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేటాడారు. ఓ టీనేజ్ కుర్రాణ్ని పట్టుకున్నారు. ప్రశ్నించారు. చేసిన నేరాన్ని బయటపెట్టాడు.

ఏం జరిగిందంటే: సాయంత్రం వేళ ఇంటి బయట నాలుగేళ్ల పాప ఆడుకుంటోంది. ఆ పాపపై కన్నేసిన టీనేజర్... బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపాడు. వాటి కోసం దగ్గరకు వెళ్లిన పాపను పక్కనే ఉన్న చెరుకు తోటలోకి ఎత్తుకెళ్లాడు. మృగంలా ప్రవర్తించాడు. రేప్ చేయాలని చూశాడు. బ్లీడింగ్ అవ్వడంతో... విషయం అందరికీ తెలిస్తే డేంజర్ అనుకొని... పాపను చంపేయాలనుకున్నాడు. గట్టిగా పీక నొక్కాడు. ఊపిరాడక చిన్నారి విలవిలలాడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. పాప చనిపోయిందని భావించి... తనను ఆ చెరుకు తోటలో 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయాడు. తర్వాత అక్కడి నుంచీ పారిపోయాడు.

ఐతే... చెరుకు తోట నుంచీ కుర్రాడు పారిపోవడాన్ని అక్కడి ఓ రైతు చూశాడు. అతని ద్వారా వివరాలు తెలుసుకున్న పోలీసులు ఆ టీనేజర్‌ను పోస్కో చట్టం కింద అరెస్టు చేసి... జువెనైల్ డిటెన్షన్ సెంటర్‌కి తరలించారు. మన సమాజంలో ఇలాంటి నేరాలు పెరుగుతున్నాయి. మీ పిల్లల్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోమంటోంది ఈ కథ.

ప్రపంచంలోని 16 వెరైటీ మెడికల్ థెరపీలు
First published: