సీనియర్ విద్యార్థి బట్టలూడదీసి కట్టెలు, బెల్టుతో దాడి చేసిన పదో తరగతి విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు స్కూల్ విద్యార్థులు బలవంతంగా సీనియర్ బట్టలూడదీసి కట్టెలతో, బెల్టులతో కొట్టి హింసించారు.

news18-telugu
Updated: October 5, 2020, 3:17 PM IST
సీనియర్ విద్యార్థి బట్టలూడదీసి కట్టెలు, బెల్టుతో దాడి చేసిన పదో తరగతి విద్యార్థులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొందరు స్కూల్ విద్యార్థులు బలవంతంగా సీనియర్ బట్టలూడదీసి కట్టెలతో, బెల్టులతో కొట్టి హింసించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా నిందితులు రికార్డు చేశారు. అమ్మాయి విషయంలో చోటుచేసుకున్న పరిణామాల వల్లే ఇలా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థి 10వ తరగతి చదువుతున్న బాలికను కలిసేందుకు వెళ్లాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అతడు కారులో అక్కడికి చేరుకున్నాడు. కారులో నుంచి దిగి అమ్మాయితో మాట్లాడుతూ ముందుకు సాగాడు. అయితే అక్కడికి ఒక్కసారిగా చేరుకున్న నలుగురు 10 తరగతి విద్యార్థులు అతడిపై దాడికి దిగారు.

బాధితుడితో పాటు వచ్చిన స్నేహితులు అతని కాపాడేందుకు ప్రయత్నించగా.. 10వ తరగతి విద్యార్థులు వారిపై కూడా దాడి చేశారు. అనంతరం బలవంతంగా బాధితుడిని అతని కారులోనే ఎక్కించి... అటవీ ప్రాంతానికి తీసుకుని వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అతని నోట్లో గుడ్డ కుక్కి దారుణంగా వ్యవహరించారు. అలాగే బాధితుడి ఫోన్‌లోని కొన్ని ఫొటోలను కూడా నిందితులు తమ ఫోన్లలోకి పంపించుకున్నారు. అనంతరం బాధితుడి సోషల్ మీడియా అకౌంట్స్‌ను కూడా డీయాక్టివేట్ చేశారు. అటవీ ప్రాంతానికి చేరుకున్నాక అతని బట్టలూడదీసి కట్టలు, బెల్ట్‌తో గట్టిగా కొట్టారు.

తనపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.తనను హింసించిన దృశ్యాలను నిందితులు వీడియో తీసినట్టు చెప్పాడు. అలాగే పదో తరగతి అమ్మాయితో తను రిలేషన్‌లో ఉన్నట్టు కూడా అంగీకరించాడు. ఇక, నలుగురు నిందితులు పథకం ప్రకారమే ఈ దాడి చేసి ఉంటారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే ఈ ఘటనలో బాధితుడు కలిసేందుకు వెళ్లిన అమ్మాయి పాత్ర ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Published by: Sumanth Kanukula
First published: October 5, 2020, 3:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading