షాద్‌నగర్‌లో దారుణం... యువతి సజీవ దహనం

షాద్‌నగర్ సమీపంలో ప్రియాంక రెడ్డి అనే యువతిని సజీవ దహనం చేయడం సంచలన సృష్టిస్తోంది.

news18-telugu
Updated: November 28, 2019, 1:10 PM IST
షాద్‌నగర్‌లో దారుణం... యువతి సజీవ దహనం
ప్రతీకాత్మకచిత్రంం
  • Share this:
తెలంగాణలోని షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. నిన్న సాయంత్రం ఆస్పత్రికి వెళ్లిన ఓ యువతి... ఉదయం సజీవ దహనమై ఉండటం సంచలనం రేపింది. మృతురాలిని ప్రియాంక రెడ్డిగా గుర్తించారు. ట్రీట్ మెంట్ కోసం నిన్న సాయంత్రం మాదాపూర్‌లోని ఓ హాస్పిటల్‌కు వెళ్లిన ప్రియాంక... తిరిగి వచ్చే సమయంలో తన స్కూటీ పాడైపోయిందని చెల్లెలికి ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తన స్కూటీ పాడైందని... చుట్టుపక్కల లారీ డ్రైవర్లు ఉన్నారని.. తనకు భయమేస్తోందని ఆమె తన చెల్లికి ఫోన్‌లో చెప్పినట్టు సమాచారం. రాత్రంతా ప్రియాంక ఇంటికి రాకపోవడంతో... ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షాద్ నగర్ సమీపంలో ఓ యువతి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉందని గుర్తించిన పోలీసులు... మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న బాధితురాలి కుటుంబసభ్యులు... ఆ డెడ్ బాడీ ప్రియాంక రెడ్డిదే అని గుర్తించారు.

ఈ ఘటనపై దర్యాప్తు కోసం నాలుగు టీమ్‌లను పోలీసులు రంగంలోకి దింపారు. ప్రియాంక రెడ్డిని లారీ డ్రైవర్లే హత్య చేశారా లేక ఆమె హత్య కేసులో మరెవరి పాత్రైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రియాంక తన సోదరితో మాట్లాడిన ఫోన్ కాల్‌ కీలకంగా మారనుంది. ప్రియాంక రెడ్డి చివరగా తన సోదరితో ఫోన్‌లో మాట్లాడిందా లేక మరెవరితోనైనా ఫోన్‌లో మాట్లాడిందా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

First published: November 28, 2019, 12:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading