TikTok Death: టిక్‌టాక్ వీడియో చేస్తుండగా సడెన్‌గా యువకుడి మృతి, ఏం జరిగిందంటే..?

17 సంవత్సరాల ప్రతీక్ వాడేకర్ తన స్నేహితులతో కలిసి టిక్ టాక్ యాప్ ద్వారా వీడియో తీస్తున్నాడు. వెరైటీగా ఉండాలని ఒక దేశీ తపంచా సంపాదించి దాంతో తలకు గురిపెట్టుకొని సరదా వీడియో తీయాలని ప్రతీక్ అనుకున్నాడు.

news18-telugu
Updated: June 15, 2019, 10:19 PM IST
TikTok Death: టిక్‌టాక్ వీడియో చేస్తుండగా సడెన్‌గా యువకుడి మృతి, ఏం జరిగిందంటే..?
TikTok Death: టిక్‌టాక్ వీడియో చేస్తుండగా సడెన్‌గా యువకుడి మృతి, ఏం జరిగిందంటే..?
news18-telugu
Updated: June 15, 2019, 10:19 PM IST
టిక్‌టాక్ వీడియో చేస్తుండగా, ఓ యువకుడు దేశీ తుపాకీతో ఫోజులు ఇస్తుండగా, ప్రమాదవశాత్తూ పేలడంతో కణితికి బుల్లెట్ తగిలి అక్కడికక్కడే చనిపోయిన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మృతుడు ప్రతీక్ వాడేకర్ షిర్డీ పట్టణంలో నివాసముంటున్నాడు. 17 సంవత్సరాల ప్రతీక్ వాడేకర్ తన స్నేహితులతో కలిసి టిక్ టాక్ యాప్ ద్వారా వీడియో తీస్తున్నాడు. వెరైటీగా ఉండాలని ఒక దేశీ తపంచా సంపాదించి దాంతో తలకు గురిపెట్టుకొని సరదా వీడియో తీయాలని ప్రతీక్ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రతీక్ పంట పొలాల్లో పందులను కాల్చే దేశీ తపంచాను కణతికి గురిపెట్టుకొని డైలాగ్ చెబుతూ ట్రిగ్గర్ నొక్కాడు. ఇంకేముంది అందులోని మందుగుండు ఒక్కసారిగా పేలడంతో ప్రతీక్ తలలోకి గుండు ఒక్కసారిగా దూసుకెళ్లింది. దీంతో ప్రతీక్ అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఒక్కసారిగా ప్రతీక్ కుటుంబం ఉలిక్కి పడింది. ప్రతీక్ ను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: June 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...