లాక్డౌన్ కారణంగా సంజీవి ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన రాజేంద్రన్ పొలం దున్నేందుకు సౌందరరాజన్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్న సంజీవి కూడా తండ్రితో పాటు ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లాడు. కొంత పొలం దున్నాక సౌందరరాజన్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లాడు. పొలంలోనే చెట్టు కింద కూర్చోవాలని తాను తినేసి, భోజనం తీసుకొస్తానని కొడుకు సంజీవికి చెప్పి వెళ్లాడు.
చెన్నై: యువతలో రానురానూ సెల్ఫీల మోజు పెరిగిపోతోంది. ఆ సెల్ఫీలు కూడా అందరి కంటే భిన్నంగా తీసుకోవాలన్న ఆలోచన వారిని చిక్కుల్లోకి నెట్టేస్తోంది. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీ దిగి.. అదేదో ఘన కార్యం చేసినట్లు ఫేస్బుక్, వాట్సాప్ స్టేటస్‌లో ఆ సెల్ఫీని పోస్ట్ చేయడం కొందరికి అలవాటుగా మారింది. అలా సెల్ఫీ మోజులో పడి తమిళనాడుకు చెందిన ఓ 16 ఏళ్ల అబ్బాయి ప్రాణం పోగొట్టుకున్నాడు. ట్రాక్టర్‌పై ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ ట్రాక్టర్‌తో పాటు బాలుడు కూడా బావిలో పడి చనిపోయాడు. ఈ ఘటన ఆ బాలుడి కుటుంబంలో పెను విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా చిన్నమోటూరుకు చెందిన సౌందరరాజన్‌కు ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ తనకున్న కొంత వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ సౌందరరాజన్ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు పెళ్లైంది. 16 ఏళ్ల వయసున్న సంజీవి అనే కొడుకు ఉన్నాడు. స్కూల్‌కు సెలవు వచ్చినప్పుడల్లా తండ్రితో కలిసి సరదగా పొలానికి ట్రాక్టర్‌పై వెళ్లేవాడు. సౌందరరాజన్ కూడా కొడుకుకు ట్రాక్టర్ నేర్పేందుకు ప్రయత్నించేవాడు. లాక్డౌన్ కారణంగా సంజీవి ఇంటి వద్దే ఉంటున్నాడు. అదే గ్రామానికి చెందిన రాజేంద్రన్ పొలం దున్నేందుకు సౌందరరాజన్ ట్రాక్టర్ తీసుకుని వెళ్లాడు. ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్న సంజీవి కూడా తండ్రితో పాటు ట్రాక్టర్‌పై పొలానికి వెళ్లాడు. కొంత పొలం దున్నాక సౌందరరాజన్ మధ్యాహ్నం భోజనానికి ఇంటికెళ్లాడు. పొలంలోనే చెట్టు కింద కూర్చోవాలని తాను తినేసి, భోజనం తీసుకొస్తానని కొడుకు సంజీవికి చెప్పి వెళ్లాడు. అయితే.. ఇంటికి వెళుతూ ట్రాక్టర్‌కు ‘కీ’ ఉంచి వెళ్లాడు. తండ్రి తినడానికి ఇంటికి వెళ్లడంతో ఆయన వచ్చేలోపు సరదాగా ట్రాక్టర్‌ను నడపాలని సంజీవి అనుకున్నాడు.
అంతేకాదు.. ట్రాక్టర్ నడుపుతూ సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనే సంజీవి ప్రాణం తీసింది. ట్రాక్టర్ ఎక్కి స్టార్ట్ చేశాడు. ట్రాక్టర్ నడుపుతూ స్మార్ట్‌ఫోన్ తీసి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ దగ్గర్లో ఉన్న 60 అడుగుల లోతు బావిలో ట్రాక్టర్ పడిపోయింది. బ్రేక్ వేసేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే సగం ట్రాక్టర్ భాగం బావిలోకి వెళ్లిపోవడంతో ప్రయోజనం లేకుండా పోయింది. సంజీవి కూడా ట్రాక్టర్‌తో పాటే బావిలో పడ్డాడు. సమీపంలోని పొలాల్లో ఉన్న గ్రామస్తులు సంజీవి ట్రాక్టర్‌తో సహా బావిలో పడటాన్ని గమనించారు. కాపాడేందుకు అక్కడికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
గ్రామస్తులు వానియంబాడి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న సహాయక సిబ్బంది నాలుగు మోటార్లతో బావిలో నీటిని బయటకు తోడారు. క్రేన్ సాయంతో ట్రాక్టర్‌ను, బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. వినూత్నంగా సెల్ఫీ దిగాలని భావించిన ఆ బాలుడి జీవితం ఇలా అర్థాంతరంగా ముగిసిపోయింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.