Home /News /crime /

TEEN WHO ELOPED WITH DALIT MAN KILLED BY FATHER IN RAJASTAN SSR

Rajasthan: కూతురికి పెళ్లి చేసినా దళిత యువకుడితో వెళ్లిపోయిందని తండ్రి ఎంతపని చేశాడంటే..

రోషన్, పింకి

రోషన్, పింకి

రాజస్తాన్‌లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురు ఓ దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆమెను కన్నతండ్రే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజస్తాన్‌లోని దౌసా పట్టణంలో వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు...

    దౌసా: రాజస్తాన్‌లో పరువు హత్య కలకలం రేపింది. కన్న కూతురు ఓ దళిత యువకుడిని పెళ్లి చేసుకుందనే కారణంగా ఆమెను కన్నతండ్రే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన రాజస్తాన్‌లోని దౌసా పట్టణంలో వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు రాజస్తాన్ హైకోర్టు భద్రత కల్పించింది. హైకోర్టు భద్రత కల్పించినప్పటికీ ఈ ఘటన జరగడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్ లాల్ సైనీ కుమార్తె పింకి సైనీ(18)కి ఫిబ్రవరి 16న వివాహం జరిగింది. ఈ పెళ్లి ఆమెకు ఇష్టం లేదు. అయినప్పటికీ పెద్దల బలవంతంతో పెళ్లికి అంగీకరించింది. అయితే.. ఫిబ్రవరి 16న పెళ్లి చేసుకున్న పింకి సైనీ ఫిబ్రవరి 21న రోషన్ మహవర్(24) అనే తను ప్రేమించిన దళిత యువకుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఫిబ్రవరి 26న పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తమకు భద్రత కల్పించాలని రాజస్తాన్ హైకోర్టును ఈ జంట ఆశ్రయించింది.

    ఇద్దరూ మేజర్లు కావడంతో రాజస్తాన్ హైకోర్టు వీరి అభ్యర్థనను మన్నించి వాళ్లు ఎక్కడ ఉంటారో అక్కడి స్థానిక పోలీసులు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే.. మార్చి 1న దౌసాలోని రోషన్ ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పింకినీ బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన వ్యక్తులు పింకీ కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. పింకీ కనిపించకపోవడంతో పోలీసులు గాలిస్తుండగా.. బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన పింకి తండ్రి శంకర్ లాల్ సైనీ తన కూతురిని చంపేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతని చెప్పిన మాటతో షాకయిన పోలీసులు శంకర్ లాల్ ఇంటికెళ్లి చూడగా.. పింకి శవమై కనిపించింది. శంకర్ లాల్ తన కుమార్తెను గొంతు నులిమి చంపేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

    శంకర్ లాల్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనలో భాగమైన మిగిలిన వ్యక్తుల ఎవరనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. పింకి, రోషన్ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ ఘటన జరగడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పింకి, రోషన్‌కు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు ఆ ఆదేశాలను విస్మరించారని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. పింకి కనిపించకుండా పోయిన మార్చి 1న రోషన్ కుటుంబ సభ్యులు పింకి కుటుంబ సభ్యుల్లో 11 మందిపై ఫిర్యాదు చేశారు. పింకి తండ్రి శంకర్ లాల్ సైనీ, మిగిలిన వ్యక్తులు తమ ఇంటికొచ్చి కులం పేరుతో దుర్భాషలాడి ఇంటిని ధ్వంసం చేశారని.. లక్ష రూపాయలకు పైగా డబ్బును, బలవంతంగా పింకీని తీసుకెళ్లారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రోషన్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
    Published by:Sambasiva Reddy
    First published:

    Tags: Crime news, High Court, Lovers, Rajasthan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు