డబ్బుల కోసం యువకుడి కిడ్నాప్ డ్రామా.. తాళ్లతో చేతులు కట్టుకుని తల్లిదండ్రులకే ఫోన్ చేసి..

బెంగళూరుకు చెందిన ఓ 16 ఏళ్ల యువకుడు ఇంటి నుంచి పారిపోయి కిడ్నాప్ డ్రామా ఆడాడు. చేతులకు తాళ్లు కట్టుకుని వీడియో తీసి తల్లిదండ్రులకు పంపించాడు. మీ కుమారుడు కిడ్నాప్ అయ్యాడు విడిపించాలంటే రూ. 5 లక్షలు పంపాలని డిమాండ్ చేశాడు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని గుర్తించారు.

news18-telugu
Updated: November 10, 2020, 2:47 PM IST
డబ్బుల కోసం యువకుడి కిడ్నాప్ డ్రామా.. తాళ్లతో చేతులు కట్టుకుని తల్లిదండ్రులకే ఫోన్ చేసి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇటీవల చిన్నారుల కిడ్నాప్ ఘటనలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే బెంగళూరుకు చెందిన ఓ 16 ఏళ్ల యువకుడు ఇంటి నుంచి పారిపోయి కిడ్నాప్ డ్రామా ఆడాడు. చేతులకు తాళ్లు కట్టుకుని వీడియో తీసి తల్లిదండ్రులకు పంపించాడు. మీ కుమారుడు కిడ్నాప్ అయ్యాడు విడిపించాలంటే రూ. 5 లక్షలు పంపాలని డిమాండ్ చేశాడు. అయితే తల్లిదండ్రుల ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని గుర్తించారు. ఇదంతా తన స్నేహితులతో కలిసి ఆడిన డ్రామా అని పోలీసుల ఎదుట ఆ యువకుడు ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులతో పాటు, ఆ తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. వివరాల ప్రకారం.. తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకు సమీపంలోని కనకపుర ప్రాంతంలో రమేష్(పేరు మార్చాం) అనే 16 ఏళ్ల యువకుడు నివసిస్తున్నాడు. అతని తండ్రి ఓ బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 6న రమేష్ ఇంటర్ నెట్ సెంటర్ కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

అనంతరం బెంగళూరుకు వచ్చి నయందహళ్లి మెట్రో స్టేషన్ వద్ద బైక్ ను పార్కు చేశాడు. అక్కడి నుంచి మెట్రోలో మెజెస్టిక్ వద్ద ఉండే బస్టాండ్ కు వెళ్లాడు. అక్కడి నుంచి బస్ ఎక్కి తిరుపతి వెళ్లిపోయాడు. అక్కడ ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని ఉన్నాడు. అయితే రమేష్ ఎంతకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఆ యువకుడి తండ్రికి ఓ ఫొటో, వీడియో వాట్సాప్ లో వచ్చింది. వాటిలో రమేష్ చేతులకు తాళ్లు కట్టి ఉంది. రమేష్ కిడ్నాప్ కు గురయ్యాడని, అతడిని విడిపించాలంటే రూ. 5 లక్షలు చెల్లించాలని ఆ వాట్సాప్ మెసేజ్ ల సారాంశం. ఈ సమాచారాన్ని యువకుడి తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

వాట్సాప్ మెసేజ్ లు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న అంశంపై విచారణ జరపగా.. తిరుపతి నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. దీంతో తిరుపతికి వెళ్లి ఓ లాడ్జిలో యువకుడిని పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువకుడిని విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. తన ఫ్రెండ్స్ తో కలిసి తానే డబ్బుల కోసమ ఈ డ్రామా ఆడినట్లుగా యువకుడు పోలీసుల విచారణలో అంగీకరించాడు. పాఠశాలలు లేని ఈ సమయంలో తన తల్లిదండ్రులు చదువుకోమని ఒత్తిడి తెస్తున్నారని.. అది తనకు ఇష్టం లేదని రమేష్ తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో కన్నడ మూమీ ‘Operation Alamelamma’ సినిమా చూసి దాని స్టోరీ ఆధారంగా కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని తల్లిదండ్రుల వద్దకు పంపించారు.
Published by: Nikhil Kumar S
First published: November 10, 2020, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading