కామారెడ్డిలో టీఆర్‌ఎస్ నాయకుడి బాగోతం వెలుగులోకి.. కామంతో కళ్లు మూసుకుపోయి..

ఆసిఫ్(ఫైల్ ఫొటో)

జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్ నాయకుడు సిగ్గుమాలిన పని చేశాడు. వరుసకు మేనకోడలు అయ్యే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో...

  • Share this:
    కామారెడ్డి: జిల్లాకు చెందిన ఓ టీఆర్‌ఎస్ నాయకుడు సిగ్గుమాలిన పని చేశాడు. వరుసకు మేనకోడలు అయ్యే బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో మైనారిటీ వర్గానికి చెందిన బాలిక తల్లితో కలిసి నివాసముండేది. అయితే.. ఇటీవలే ఆ బాలిక తల్లి మృతి చెందడంతో ఆమె బాగోగులు చూసుకునే వారే కరువయ్యారు. తల్లిని కోల్పోయి ఒంటరిగా మిగిలిన ఆ బాలికను వెతుక్కుంటూ మేనమామ వరుసయ్యే ఆసీఫ్ ఆమె ఇంటికొచ్చాడు. ఆసీఫ్ కామారెడ్డికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కావడం గమనార్హం.

    ఒంటరిగా మిగిలిన ఆ బాలిక బాగోగులను ఆసీఫ్ చూసుకునేవాడు. అయితే.. ఎందుకీ పాడుబుద్ధి పుట్టిందో తెలియదు గానీ ఆ బాలికపై ఆసీఫ్ కన్ను పడింది. ఆమెకు తనంటే నమ్మకం కలిగేలా కొన్నిరోజులు ప్రవర్తించిన ఆసిఫ్ రానురాను తన వక్రబుద్ధి బయటపెట్టసాగాడు. ఆమెను అక్కున చేర్చుకునే వంకతో ఎక్కడెక్కడో తాకేవాడు. ఆ బాలిక గొర్రె కసాయివాడిని నమ్మినట్టుగా ఆసిఫ్‌ను నమ్మింది. అయితే.. రెండు రోజుల క్రితం సదరు బాలికను టౌన్‌కు వెళ్దామని నమ్మించిన ఆసిఫ్ కామారెడ్డి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె కోరింది కొనిచ్చాడు. ఆమె ఏం తినాలని కోరుకుందో అన్నీ తీసుకొచ్చి పెట్టాడు.

    మేనమామ కద అని నమ్మడమే ఆ బాలిక చేసిన పాపమైంది. ఆమె పూర్తిగా నమ్మిన క్రమంలోనే.. ఆసిఫ్‌లోని కామాంధుడు నిద్రలేచాడు. ఆమెను కామారెడ్డిలోని ఓ రహస్య ప్రదేశానికి ఆమెను తీసుకెళ్లాడు. తనకు శారీరకంగా సహకరించాలని ఆమెను కోరాడు. ఆ బాలికకు ఆసిఫ్ దురాలోచన అర్థమైంది. అందుకు ఏమాత్రం ఒప్పుకునేది లేదని ఆమె అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దీంతో.. ఆ బాలికను బంధించి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. అత్యాచారం విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే.. బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    కామారెడ్డి రూరల్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సదరు బాలికపై అత్యాచారానికి పాల్పడిన అనంతరం ఆసిఫ్ ఆమెను గంభిరావుపేటలో వదిలేసి వెళ్లాడని ఆయన తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సిఐ పేర్కొన్నారు. బంధువని నమ్మిన అమ్మాయిని అత్యాచారానికి పాల్పడి ఆమె జీవితాన్ని నాశనం చేసిన ఇలాంటి వ్యక్తిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయి బంధువు బాబా డిమాండ్ చేశారు.
    Published by:Sambasiva Reddy
    First published: