అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు...

వాషింగ్టన్ డీసీలో జరిగిన కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయాడు.

news18-telugu
Updated: August 9, 2020, 9:56 PM IST
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అమెరికా సంయక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ యువకుడు చనిపోయినట్టు పోలీసులు ధ్రువీకరించారు. యువకుడి వయసు 17 సంవత్సరాలు ఉంటాయని చెప్పారు. మరో 19 మంది ఈ ఘటనలో గాయపడ్డారు. రాత్రి 12.20 గంటల సమయంలో గుమిగూడి ఉన్న వారి మీద ఎవరో వ్యక్తి పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 17 ఏళ్ల క్రిస్టోఫర్ బ్రౌన్ చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. ఆఫ్ డ్యూటీలో ఉన్న మరో పోలీసు అధికారి కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఆస్పత్రిలో ఆమె చావు బతుకుల మధ్య పోరాడుతోంది. మిగిలిన వారికి ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లేంత స్థాయిలో బుల్లెట్స్ తగలలేదు. ఫుడ్, మ్యూజిక్‌ పెట్టుకుని కొందరు గుమిగూడి ఉన్నప్పుడు కాల్పులు జరిగినట్టు పోలీసులు చెప్పారు. అయితే, వారు గుమిగూడడానికి (సామూహిక వేడుక) నిర్వహించడానికి పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కరోనా ఉన్నా కూడా పోలీసుల నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే వారు దీన్ని నిర్వహిస్తున్నారు. కాల్పులు జరిపింది ఎవరనేది తెలియాల్సి ఉంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 9, 2020, 9:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading