Nirmal: గుండెలు పిండేసే విషాదం.. భర్య ఒడిలోనే ప్రాణాలొదిలిన భర్త!

భార్య ఒడిలోనే ఓ భర్త కన్నుమూసిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో బాధిత మహిళ రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న వారికి కంటతడి పెట్టించింది.

news18-telugu
Updated: September 30, 2020, 3:38 PM IST
Nirmal: గుండెలు పిండేసే విషాదం.. భర్య ఒడిలోనే ప్రాణాలొదిలిన భర్త!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తి భార్య ఒడిలో కన్నుమూసిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. భర్తను కోల్పోయి ఆ బాధితురాలు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కంటతడి పెట్టించింది. కరోనా నేపథ్యంలో బాధితుల వద్దకు ఎవరూ వెళ్లి ఓదార్చలేని పరిస్థితి ఏర్పడడం ఇంకా వారిని బాధపెట్టింది. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నందికి చెందిన సగావత్ గోపాల్ కొంత కాలంగా మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో మూడు నెలల నుంచి కడెం మండలం గచ్చుకుంటలోని బంధువుల వద్ద ఉంటున్నాడు. అక్కడి నుంచి రెండు రోజులకు ఒక సారి ఊట్నూరు వెళ్లి డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం ఉట్నూరు వెళ్లి డయాలసిస్ చేయించుకున్నాడు. అనంతరం ఇంటికి వెళ్లడానికి ఇందనపల్లికి వచ్చాడు. అక్కడ బస్సుకోసం ఎదురు చూస్తుండగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో అతను అక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో పక్కన ఉన్న వారు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. సమచారం అందుకున్న 108 సిబ్బంది సైతం అక్కడికి వచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన భార్య మంజుల ఏడుస్తూ కొనఊపిరితో ఉన్న భర్త గోపాల్ ను ఒడిలోకి తీసుకుంది. ఆ వెంటనే అతను తుదిశ్వాస విడిచారు. కట్టుకున్న భర్త కళ్లెదుటే మరణించడంతో ఆ భార్య గుండెలవిసేలా రోదించింది. భర్తను బతికుంచుకోలేకపోయానంటూ ఆమె ఏడుస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కన్నీరు పెట్టించింది.
Published by: Nikhil Kumar S
First published: September 30, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading