Video : ప్రజాగ్రహంతో రగులుతున్న ఫ్రాన్స్‌...

ఫ్రాన్స్ లోని మాక్రాన్ ప్రభుత్వం విధించిన ఇంధన పన్నుకు వెతిరేకంగా జరిగిన 'యెల్లో వెస్ట్ ఉద్యమం' తీవ్ర రూపం దాల్చింది.

news18-telugu
Updated: November 17, 2019, 11:41 AM IST
Video : ప్రజాగ్రహంతో రగులుతున్న ఫ్రాన్స్‌...
Video : ప్రజాగ్రహంతో రగులుతున్న ఫ్రాన్స్‌...
  • Share this:
పారిస్ లో ఇంధన పన్నుకు వ్యతిరేకంగా 2018 నవంబర్‌లో 'యెల్లో వెస్ట్ ఉద్యమం' ప్రారంభమైంది. దీన్ని నిరసిస్తూ పెద్దఎత్తున నిరసనలు వెల్లివెత్తాయి. లక్షలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు. అప్పుడు ఈ ఉద్యమంలో దేశవ్యాప్తంగా 3,00,000 నిరసనకారులు పాల్గొన్నారు.

ఐతే ఈ ఉద్యమం మొదలై ఏడాది అయినా సందర్బంగా.. మొదటి వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి శనివారం నిరసన నాయకులు మద్దతుదారులకు పిలుపునివ్వడంతో ప్రజలు పారిస్ వీధుల్లోకి వచ్చారు. అధ్యక్షుడు మాక్రాన్ రాజీనామా చేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. బారికేడ్లను తగులబెట్టడం, భవనాలు, దుకాణాల అద్దాలను పగులగొడుతూ పెద్దఎత్తున విధ్వంసానికి దిగారు. నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో.. ఆందోళనలకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్ప వాయు గోళాలు ప్రయోగించారు.

Published by: rajaneedhar Reddy
First published: November 17, 2019, 11:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading