కామంతో కళ్లుమూసుకుపోయిన టీచర్ అంథురాలిపై.. సీసీటీవీ కెమెరాలో బాగోతం

45 ఏళ్ల హిమాన్షు రంజన్ అనే టీచర్.. అంథుల పాఠశాలలో క్రీడలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే, ఓ అంథ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు.

news18-telugu
Updated: May 1, 2019, 2:33 PM IST
కామంతో కళ్లుమూసుకుపోయిన టీచర్ అంథురాలిపై.. సీసీటీవీ కెమెరాలో బాగోతం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ టీచర్ కామాంధుడిగా మారాడు. అంథ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిచాడు. ఈ బాగోతం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వెలుగులోకి వచ్చింది. పంజాబ్‌లోని లూథియానాలో ఈ ఘటన జరిగింది. 45 ఏళ్ల హిమాన్షు రంజన్ అనే టీచర్.. అంథుల పాఠశాలలో క్రీడలు నేర్పిస్తూ ఉంటాడు. అయితే, ఓ అంథ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక క్లాసులో ఉండగా, ఆమె కూర్చున్న కుర్చీ పక్కన అతడు కూడా కుర్చీ వేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రహించిన బాలిక.. తన టీచర్ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని ఇంట్లో వారికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత క్లాసులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాను పరిశీలించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.
First published: May 1, 2019, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading