ప్రభుత్వ స్కూల్లో ఘోరం... ఒకటో తరగతి విద్యార్థినిపై లైంగిక దాడి
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగితే దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన ఆ స్కూల్ ఉపాధ్యాయులు... బాధితులకు నచ్చజెప్పటానికి ప్రయత్నించి తోటి ఉపాధ్యాయునికి సపోర్ట్ గా నిలవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
news18-telugu
Updated: July 21, 2019, 11:05 AM IST

ప్రతీకాత్మక చిత్రం
- News18 Telugu
- Last Updated: July 21, 2019, 11:05 AM IST
ప్రకాశం జిల్లా అర్ధవీడులో దారుణం జరిగింది. అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ టీచర్ తన పైశాచికత్వం చూపించాడు. అర్ధవీడు మండలం ప్రభుత్వ ఎయిడెడ్ SSRM పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్న 6 ఏళ్ల విద్యార్థిని పట్ల అదే స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మంతు వెంకటేశ్వర రెడ్డి అలియాస్ గోపీ రెడ్డి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడు బాలిక పట్ల లైంగిక దాడికి పాల్పడినట్లుగా బాలిక తల్లిదండ్రులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉపాధ్యాయుడు మూడు రోజుల క్రితం ఈ దారుణానికి పాల్పడటంతో.. విద్యార్థి కుటుంబ సభ్యులు 2 రోజుల క్రితం పాఠశాలకు వచ్చి నిలదీసినట్లు తెలుస్తోంది. కానీ, వెంకటేశ్వర రెడ్డితో పనిచేసే సహ ఉపాధ్యాయులు బాధిత కుటుంబానికి నచ్చజెప్పి పంపిచినట్లు తెలుస్తోంది. అయినా బాధిత కుటుంబం నిన్న మళ్లీ ఉపాధ్యాయుని నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై లైంగికదాడి జరిగితే దానిపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన ఆ స్కూల్ ఉపాధ్యాయులు... బాధితులకు నచ్చజెప్పటానికి ప్రయత్నించి తోటి ఉపాధ్యాయుని సపోర్ట్ గా నిలవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పాఠశాలలో ఈ అఘాయిత్యం జరిగితే మిగతా ఉపాధ్యాయులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.విద్యాబుద్దులు నేర్పిస్తారని స్కూల్‌కు పంపుతున్న తమ పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంటే పిల్లల్ని బడికి ఎలా పంపేది అంటూ నిలదీస్తున్నారు. కీచక టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

దిశ హంతకుల ఎన్కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
ఏపీలో 2020లో ప్రభుత్వ సెలవులు ఇవే...
బ్రాండ్ మీరు చెబితే.. బ్రాండింగ్ నేను చేస్తా... పవన్ కళ్యాణ్
Loading...