మహిళను సజీవ దహనం చేసిన ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడికి జీవిత ఖైదు, రూ.2,000 జరిమానా విధిస్తూ ఎల్బి నగర్ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…మేడిపల్లి, బోడుప్పల్‌కు చెందిన దేవితో తారాల సత్యనారాయణ 2003లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఐడిఎ ఉప్పల్‌లోని టిఎంసి గోడౌన్లో సత్యనారాయణ హెల్పర్‌గా పనిచేస్తుండగా, దేవి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. అదే పాఠశాలలో పనిచేస్తున్న చల్లా శివప్రసాద్‌తో దేవికి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో దేవి వద్ద అవసరానికి డబ్బులు తీసుకుంటుండడంతో తరచూ వారి ఇంటికి వచ్చేవాడు.
ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవలు జరిగేవి. పాఠశాల భాగస్వామ్యంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో తన ఇంటికి రావద్దని శివప్రసాద్‌కు సత్యనారాయణ వార్నింగ్ ఇచ్చాడు. అయినా కూడా 2015, మార్చి, 24వ తేదీన దేవి ఇంటికి వచ్చిన శివప్రసాద్ గొడవ పడ్డాడు. ముందస్తు ప్లాన్‌లో భాగంగా మంచినీరు కావాలని దేవిని అడిగాడు ఆమె తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్లగానే ఇంటి డోర్ మూసివేశాడు. వంటింట్లోకి వెళ్లి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. పక్క ఇంటివారు చూసి బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime, Crime news, Crime story, CYBER CRIME, Gun fire