స్టూడెంట్స్ వాట్సప్ గ్రూపులో పోర్న్ వీడియో పోస్టు చేసిన టీచర్..

ఐదో తరగతి పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఓ వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. అందులో ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తుంటారు.

news18-telugu
Updated: June 10, 2020, 1:45 PM IST
స్టూడెంట్స్ వాట్సప్ గ్రూపులో పోర్న్ వీడియో పోస్టు చేసిన టీచర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ టీచర్ తన ఐదో తరగతి విద్యార్థుల వాట్సప్ గ్రూపులో ఓ ఫోర్న్ వీడియో పోస్టు చేసింది. దీంతో సదరు టీచర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కొల్లంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొల్లం పరిధిలోనిమారుతామన్పల్లికి చెందిన మనోజ్ కే.మాథ్యూ(45) చుంకతర వీరనల్లూర్ ఈఈటీయూపీ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడం వల్ల స్కూల్స్ మూతపడిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు నష్టపోకుండా అక్కడి ప్రభుత్వం ఆన్‌లైన్ లెర్నింగ్‌ను ప్రవేశపెట్టింది. అందులో భాగంగానే ఐదో తరగతి పాఠశాల విద్యార్థులకు సంబంధించి ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం ఓ వాట్సప్ గ్రూపును క్రియేట్ చేశారు. అందులో ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తుంటారు. అయితే టీచర్ మనోజ్ మొబైల్ నుంచి మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఐదో తరగతి విద్యార్థుల ఆన్‌లైన్ స్టడీ గ్రూపులో ఓ ఫోర్న్ వీడియో పోస్టు అయ్యింది.

దీంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే తల్లిదండ్రులు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి సమాచారం అందించారు. ఈ ఘటనపై ఉపాధ్యాయులను పిలిచి పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫోర్న్ వీడియో పోస్టు చేసే సమయంలో ఫోన్ తన స్నేహితుడి చేతిలో ఉందని సదరు ఉపాధ్యాయుడు వివరించారు. అనంతరం స్కూల్ కరస్పాండెంట్‌తో పాటు ఎంఈఓలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ కేఎస్‌యూ, బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.
Published by: Narsimha Badhini
First published: June 10, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading