హోమ్ /వార్తలు /crime /

Shocking:  విద్యార్థినిపై కన్నేసిన కీచక ఉపాధ్యాయుడు.. క్లాస్ లోనే అసభ్యంగా తాకుతూ.. ఆ తర్వాత..

Shocking:  విద్యార్థినిపై కన్నేసిన కీచక ఉపాధ్యాయుడు.. క్లాస్ లోనే అసభ్యంగా తాకుతూ.. ఆ తర్వాత..

Tamil nadu: తరగతిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కీచకుడిలా మారాడు. మనవరాలి వయసున్న విద్యార్థిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు.

Tamil nadu: తరగతిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కీచకుడిలా మారాడు. మనవరాలి వయసున్న విద్యార్థిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు.

Tamil nadu: తరగతిలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ కీచకుడిలా మారాడు. మనవరాలి వయసున్న విద్యార్థిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను అసభ్యంగా తాకుతూ వేధింపులకు పాల్పడ్డాడు.

    Teacher molested on student:  తమిళనాడులోని దారుణం చోటు చేసుకుంది. వేలూరు జిల్లాలోని స్థానిక ఉపాధ్యాయుడు.. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రైవేటు భాగాలను తాకుతూ నీచంగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. మహిళలు, యువతులపై వేధింపులు నిరోధించడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కొందరు నీచులు మాత్రం మారడం లేదు. మహిళలపై దాడులకు పాల్పడుతునే ఉన్నారు. ప్రతిరోజు మహిళలపై వేధింపుల ఘటన వెలుగులోకి వస్తునే ఉన్నాయి. తాజాగా, మరోక వేధింపుల ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది.

    పూర్తి వివరాలు.. తమిళనాడులోని  (Tamil nadu) వేలూరులో ఈ దారుణం జరిగింది. స్థానిక పాఠశాలలో 7 వ తరగతి చదివే బాలికపై.. అదే స్కూల్ కు చెందిన మురళీకృష్ణ అనే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించాడు. బాలికకు 13 ఏళ్లు. ప్రతి రోజు బాలిక పట్ల తరగతిలోనే అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాలిక.. ఎన్నిసార్లు చెప్పిన అతను.. తన వంకర బుద్ధిని మార్చుకోలేదు. దీంతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది.

    ఇక భరించలేక గత శనివారం... ఇంట్లో ఉన్న వార్నిష్ ను తాగింది. దీంతో బాలిక అపస్మారక స్థితిలోనికి వెళ్లిపోయింది. బాలికను గమనించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో ఈ దారుణం వెలుగులోనికి వచ్చింది. బాలిక కుటుంబ సభ్యులు కీచక ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం నిందితుడిని అదుపులోనికి తీసుకున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

    హార్యానాలోకూడా వేధింపుల ఘటన గతంలో వెలుగులోనికి వచ్చింది.  గురుగ్రామ్ లో దారుణం చోటుచేసుకుంది. వాకింగ్ కు వెళ్లిన మహిళ లైంగిక వేధింపుల బారిన పడింది. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. గురుగ్రామ్ లో రెసిడెన్షియల్ సోసైటీ అపార్ట్ మెంట్ కు ఒక వ్యక్తి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో మార్చి 21 న ఒక మహిళను లైంగికంగా వేధించాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోనికి వచ్చింది.

    పోలీసులు తెలిపిన వివరాలు.. గురుగ్రామ్ లోని ఒక రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్ కు ఒక ఏజెన్సీ సెక్యురిటీని నియమించింది.వ అతను మార్చి 21న వాకింగ్ కు వెళ్లిన మహిళను వేధించాడు. ఆమె దగ్గరకు వెళ్లి.. నీకు.. స్ట్రెచింగ్ లో హెల్ప్ చేయాలా అంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా అశ్లీల వ్యాఖ్యలు చేశాడు. దీంతో భయంతో వణికిపోయిన ఆమె.. అక్కడి నుంచి వెళ్లిపొయింది. ఆ తర్వాత.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అక్కడి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో.. అపార్ట్ మెంట్ సోసైటీ వారిని ఘటనపై విచారించారు. వీరి విచారణలో వేధింపులకు పాల్పడిన సెక్యురిటీ సిబ్బందిని ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు తెలిపారు. ప్రస్తుతం నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

    First published:

    ఉత్తమ కథలు