టీచరమ్మతో కలిసి 8వ క్లాస్ స్టూడెంట్ జంప్...కామ వాంఛతో వలవేసి...

విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లి ట్యూషన్ పేరిట తన శారీరక సుఖాలు సైతం తీర్చుకునేదని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారిని మందలించామని స్కూల్ సిబ్బంది తెలిపారు.

news18-telugu
Updated: January 20, 2020, 9:27 PM IST
టీచరమ్మతో కలిసి 8వ క్లాస్ స్టూడెంట్ జంప్...కామ వాంఛతో వలవేసి...
ప్రతీకాత్మకచిత్రం (Image: Youtube)
  • Share this:
వివాహేతర సంబంధాలు సమాజంలో మానవి విలువల పతనానికి దారులు అవుతున్నాయి. తాజాగా ఇరవై ఆరు సంవత్సరాల వయస్సు ఓ మహిళా టీచర్, తన పాఠశాలకే చెందిన పద్నాలుగేళ్ల విద్యార్థితో కలిసి జంప్ అయిన సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్థానికి పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థితో టీచర్ గత సంవత్సరం పాటు సన్నిహితంగా ఉన్నట్లు సమాచారం ఉంది. విద్యార్థిని తన ఇంటికి తీసుకెళ్లి ట్యూషన్ పేరిట తన శారీరక సుఖాలు సైతం తీర్చుకునేదని కొందరు విద్యార్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వారిని మందలించామని స్కూల్ సిబ్బంది తెలిపారు. ఇదిలా ఉంటే గత వారం బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సదరు టీచర్ తన కొడుకుని మాయమాటలతో అకర్షించి తమ నుంచి దూరంగా తీసుకుపోయిందని, శుక్రవారం నుంచి తన కొడుకుతోపాటు టీచర్ కూడా కనిపించడంలేదని పేర్కొన్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కనిపించకుండా పోయిన టీచర్, బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు