విద్యార్థులతో టీచర్ బలవంతపు శృంగారం.. స్కూల్‌లో, కారులో వాళ్లతో..

Crime News: నలుగురు విద్యార్థినులను లొంగదీసుకొని, వారికి నరకం చూపించాడు. పైగా, వారిలో ఓ విద్యార్థినిని గర్భవతిని కూడా చేశాడు.

news18-telugu
Updated: July 30, 2019, 5:16 PM IST
విద్యార్థులతో టీచర్ బలవంతపు శృంగారం.. స్కూల్‌లో, కారులో వాళ్లతో..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విద్యాబుద్ధులు నేర్పి పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్ అతడు.. కానీ, అది మరచి విద్యార్థులతోనే సెక్స్ చేశాడు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా నలుగురు విద్యార్థినులను లొంగదీసుకొని, వారికి నరకం చూపించాడు. పైగా, వారిలో ఓ విద్యార్థినిని గర్భవతిని కూడా చేశాడు. వాళ్లంతా ధైర్యం తెచ్చుకొని ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ కామంధుడికి 12 ఏళ్ల శిక్ష విధించడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇంగ్లండ్‌లోని హాంప్‌షైర్‌లో ఉన్న వార్బ్లింగ్‌టన్ స్కూల్‌లో సీన్ ఆల్డ్రిడ్జ్(37) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. 2006 నుంచి 2012 మధ్య 13-16 వయసున్న బాలికలను లొంగదీసుకొని వారితో బలవంతంగా సెక్స్ చేశాడు. స్కూల్ పరిసరాల్లో, తన కారులో బాలికలతో శృంగార కార్యకలాపాల్లో పాల్గొన్నాడు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం విచారణ ఆదేశించింది. అయితే, అతడిపై చర్యలు తీసుకోకుండా.. అసిస్టెండ్ హెడ్ టీచర్‌గా ప్రమోట్ చేసింది.

ఆ ఫిర్యాదులు అక్కడితోనే ఆగిపోయాయి. ఆ బాలికలు పెరిగి పెద్దయ్యారు. ఆ నాడు తమకు జరిగిన అన్యాయంపై నోరు విప్పని వాళ్లు.. 2017లో పోలీసుల చెంతకు వెళ్లి జరిగినదంతా చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆ నీచుడు ఎంతో మంది బాలికలను లొంగదీసుకొని వారితో సెక్స్ చేసేవాడని తేలింది. దీంతో కోర్టు నిందితుడికి 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
First published: July 30, 2019, 5:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading