కలెక్టర్ ఆఫీసు ముందు లోదుస్తులు ఆరేసిన టీచర్...

ఆ టీచర్ 1996 ఫిబ్రవరి 12 నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నాడు. సుమారు 23 సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు.

news18-telugu
Updated: September 21, 2019, 5:12 PM IST
కలెక్టర్ ఆఫీసు ముందు లోదుస్తులు ఆరేసిన టీచర్...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భూమిని ఓ మాజీ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడని, తన భూమిని తనకు ఇప్పించాలంటూ సుమారు 23 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఓ టీచర్.. అధికారుల తీరుతో విసిగిపోయాడు. ఈ క్రమంలో కలెక్టర్ ఆఫీసు ముందు తన లోదుస్తులు ఆరేసి నిరసన తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయ్ సింగ్ అనే ఓ ఉపాధ్యాయుడికి చెందిన భూమిని ఓ నాయకుడు కబ్జా చేశాడు. తన పేరు మీద భూమి పత్రాలు మార్చేసుకున్నాడు. అయితే, తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఆ టీచర్ 1996 ఫిబ్రవరి 12 నుంచి నిరసన తెలుపుతూనే ఉన్నాడు. సుమారు 23 సంవత్సరాల నుంచి ఆయన కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా రెవిన్యూ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో తాజాగా విజయ్ సింగ్.. కలెక్టర్ కార్యాలయం ఎదుటే ధర్నా చేసి.. పొద్దున స్నానం చేసి, తన లోదుస్తులను ఆఫీసు ఎదుటే ఆరేశాడు. దీంతో పెద్ద దుమారం రేగింది. విజయ్ సింగ్ మీద కలెక్టర్ ఆఫీస్ ఇన్‌చార్జి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కలెక్టర్ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విజయ్ సింగ్ ధర్నాను విరమించుకున్నాడు.
First published: September 21, 2019, 5:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading