TEACHER BOOKED FOR ELOPING WITH HER CLASS XI STUDENT IN HARYANA SU
ట్యూషన్ కోసం టీచర్ ఇంటికి వెళ్లిన స్టూడెంట్.. ఆ తర్వాత జరిగింది తెలిసి షాక్ తిన్న తల్లిదండ్రులు..
స్టూడెంట్‌తో కలిసి లేచిపోయిన టీచర్
ట్యూషన్ కోసం మహిళా టీచర్ ఇంటికి వెళ్లిన ఓ స్టూడెంట్.. సాయంత్రమైనప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడి ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే టీచర్ తండ్రి చెప్పిన సమాధానం విన్న బాలుడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు.
టీచర్, స్టూడెంట్ మధ్య ఉన్న సంబంధాన్ని పవిత్రమైనదని అంటారు. అయితే హర్యానాలో ఓ మహిళా టీచర్ మాత్రం.. ఆ పవిత్రతను దెబ్బతీసింది. తన వద్ద చదువు నేర్చుకుంటున్న విద్యార్థితో కలిసి ఆమె పారిపోయింది. వివరాలు.. ఓ 17 ఏళ్ల విద్యార్థి ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్నాడు. మహిళ టీచర్ అతనికి క్లాస్ టీచర్‌గా ఉంది. అలాగే అతడికి ట్యూషన్స్ కూడా చెప్పేది. అయితే అనుమానస్పద రీతిలో టీచర్, స్టూడెంట్ ఇద్దరు కనిపించ కుండా పోయారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత మూడు నెలలుగా ఆ టీచర్.. తమ కొడుక్కి ట్యూషన్స్ చెబుతుందని అతడి తల్లిదండ్రులు తెలిపారు.
టీచర్ భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం తల్లిదండ్రుల వద్ద నివసం ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఆమె రోజుకు నాలుగు గంటలు మా కుమారుడికి పాఠాలు చెప్పేది. మే 29వ తేదీన మా కుమారుడు డేస్రాజ్ కాలనీలో ఉన్న టీచర్ ఇంటికి వెళ్లాడు. అయితే ఆ రోజు సాయంత్రం గడిచిన మా కొడుకు ఇంటికి తిరిగిరాలేదు. దీంతో మేము టీచర్ కుటుంబ సభ్యులను సంప్రదించాం. అయితే వారు తొలుత ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఆ తర్వాత టీచర్ కనిపించకుండా పోయిన విషయాన్ని ఆమె తండ్రి మాకు చెప్పాడు’అని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. దీంతో తాము పోలీసులను ఆశ్రయించామని తెలిపారు.
ఇక, బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మహిళా టీచర్‌పై కేసు నమోదు చేశారు. టీచర్, బాలుడు వారి వారి ఇళ్ల నుంచి ఎలాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లలేదని పోలీసులు తెలిపారు. టీచర్ వద్ద కేవలం ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం మాత్రమే ఉందని అన్నారు. వారిద్దరి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు. వారు కనిపించకుండా పోయినప్పటి నుంచి వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయబడ్డాయని తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.