విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పి మంచి మార్గంలో నడపాల్సిన టీచర్ తప్పుడు పనికి పాల్పడింది. తన లైంగిక కోరికలు తీర్చుకోవడానికి బాలుడిని వాడుకుంది. అతడిపై లైంగిక దాడికి పాల్పడింది. తన కారులోనే పలుమార్లు లైంగిక దాడికి దిగింది. అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్‌లో ఓ కథనం ప్రచురితమైంది. వివరాలు.. 31 ఏళ్ల బ్రిటనీ లోపెజ్ ముర్రె (Brittiny Lopez-Murray) మియామి డేడి కౌంటిలోని హియాలియా మిడిల్ స్కూల్లో డ్రామా టీచర్‌గా (Florida middle school drama teacher) పనిచేస్తోంది. ఆమె తన మాజీ విద్యార్థి అయిన 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడింది.
లోపెజ్ ముర్రె నాలుగు సంవత్సరాలు హియాలియా మిడిల్లో స్కూల్లో బోధించింది. ఆమె 2017లో రూకీ టీచర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైంది. బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ తర్వాత లోపెజ్ ముర్రె విద్యార్థిని తనతో పాటు బయటకు తీసుకెళ్లేంది. ఆపై ఇద్దరూ ఆమె కారులో లైంగిక చర్యలకు పాల్పడేవారు. ప్రస్తుతం ఆ విద్యార్థి హై స్కూల్లో చదువుతున్నాడు. పలుమార్లు లోపెజ్ ముర్రె తన కారులో విద్యార్థితో సెక్స్ చేసింది.
Hyderabad Rains: సినిమా థియేటర్‌ను ముంచెత్తిన వరద నీరు.. ప్రేక్షకులకు భారీ షాక్.. ప్రహరీ గోడ కూలి..
అంతేకాకుండా వీరిద్దరు.. సెక్స్‌ను ఎంతగా ఎంజాయ్ చేశారో తెలిపేలా టెక్స్ట్ మెసేజ్‌లు కూడా చేసుకునేవారు. అయితే ఇటీవల విద్యార్థి ఫోన్లో మెసేజ్‌లు, టీచర్‌తో ఉన్న ఫొటోలను అతని సోదరి చూసింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తండ్రి అతని ఫోన్లో లోపెజ్ ముర్రె నగ్న ఫొటోలను గుర్తించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు లోపెజ్ ముర్రెను అరెస్ట్ చేసింది.
ఇక, ఆగస్టు నెలలో తనపై ఫీలింగ్స్ చెప్పాలని టీచర్ బాలుడికి మెసేజ్ పంపిందని, ఆ తర్వాత నుంచి వారిద్దరు కలుసుకునేవారిని పోలీసు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. బాలుడిని అధికారులు విచారించగా.. ఆగస్టులో టీచర్ తనకు మెసేజ్ చేసిందని.. అప్పటి నుంచి టీచర్ అలా చేసేదని చెప్పాడు.
ఈ ఘటనపై స్పందించిన మియామి డేడి డిస్ట్రిక్ట్.. లోపెజ్ ముర్రెను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆమెను తొలగించినట్టుగా మియామి హెరాల్డ్‌కు వెల్లడించింది. ‘ఉద్యోగులు అందరూ శిక్షణ పొందుతారు. ప్రతి ఒక్కరు నైతిక ప్రవర్తన విధానానికి కట్టుబడి ఉండాలని భావిస్తాం. మేము ఇందుకోసమే ప్రయత్నిస్తాం. కానీ కొందరు చర్యలు మేము ఆశించిన వాటికి విరుద్దంగా ఉండటం దురదృష్టకరం’అని తెలిపింది.
నిందితురాలిగా ఉన్న లోపెజ్ ముర్రె లాయర్లలో ఒకరు మాట్లాడుతూ.. తన క్లైయింట్ దోషిగా నిరూపితమయ్యేవరకు నిర్దోషిగా భావించాలని అన్నారు. తీర్పు రాకముందే తొందర వద్దని, కుటుంబ గోప్యతను గౌరవించాలని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Florida, Teacher misbehave