అమ్మో కీచక టీచర్... విద్యార్థినులతో యవ్వారాలు...

Telangana : సాధారణంగా ఇలాంటి టీచర్ల నిజస్వరూపం బయటపడితే తాట తీస్తున్నారు తల్లిదండ్రులు. మరి ఈ కేసులో ఏమైంది?

news18-telugu
Updated: February 21, 2020, 8:38 AM IST
అమ్మో కీచక టీచర్... విద్యార్థినులతో యవ్వారాలు...
అమ్మో కీచక టీచర్... విద్యార్థినులతో యవ్వారాలు...
  • Share this:
Telangana : పురాణాల్లో కీచకుణ్ని మళ్లీ మళ్లీ గుర్తుచేస్తున్నారు కొందరు పనికిమాలిన టీచర్లు. గురువు అన్న పదానికే మచ్చ తెస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని... ఓ హైస్కూల్‌లో తీవ్ర కలకలం రేగింది. పెద్ద సంఖ్యలో పిల్లల తల్లిదండ్రులు అక్కడకు వచ్చారు. ఏ వేడుక కోసమో రాలేదు. ఓ టీచర్‌ను చితకబాదుదామని వచ్చారు. ఇంతకీ ఏమైందంటే... ఆ టీచర్‌కి సంబంధించిన ఓ వీడియో... స్కూల్ యాజమాన్యానికి చిక్కింది. అందులో ఆ టీచర్ విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యం ఉంది. ఆ దుర్మార్గుడు రోజూ ఇలాంటి చేష్టలే చేస్తున్నాడనీ, తాకరాని చోట తాకుతున్నాడనీ విద్యార్థులు చెప్పడంతో... అతనిపై చర్యలు తీసుకుంటామని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. చర్యలు తీసుకోకపోతే... తాము యాక్షన్‌లోకి దిగుతామని పిల్లల తల్లిదండ్రులు హెచ్చరించారు.

రోజూ స్కూల్‌కి వస్తున్న టీచర్... బాలికలపై కన్నేశాడు. రెండో తరగతి పిల్లలైతే... అసభ్యంగా మాట్లాడుతున్నాడు. బుగ్గ గిల్లితే ఎర్రగా అవుతుంది... అదే అక్కడ గిల్లితే... ఏమవుతుంది అంటూ వెర్రి ప్రశ్నలు వేస్తున్నాడట. అలాగే... ఆరో తరగతి నుంచీ 8వ తరగతి బాలికలైతే... దగ్గరకు పిలిచి... ఇంకా దగ్గరకు రా... నా మాటలు నీకు వినిపించాలి కదా... ఇంకా దగ్గరకు జరుగు అంటూ వెధవ్వేషాలు వేస్తున్నట్లు తెలిసింది.

ఆ దరిద్రుడి దుర్మార్గపు చేష్టలపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇన్నాళ్లూ విద్యార్థులు ఆవేదన చెందారు. లక్కీగా ఓ వీడియో తెరపైకి రావడంతో... అయ్యవారి అరాచక లీలలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి టీచర్లపై జాలి పడాల్సిన పనిలేదు. చట్టప్రకారం శిక్షించడమే మంచిది. లేదంటే వీళ్లను చూసి... రేపు ఇతర టీచర్లు కూడా ఇలాగే చేస్తే చాలా ప్రమాదం. ఇప్పటికే స్కూళ్లు, హాస్టళ్లలో విద్యార్థులపై జరుగుతున్న అమానుష చర్యలపై రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. అయినా సరే కీచక మాస్టార్లు తమ బుద్ధి మార్చుకోవట్లేదు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు