పేకాట వివాదం.. విజయవాడ వాసులపై టీడీపీ కార్యకర్తల దాడి... బట్టలు ఊడదీసిన వీడియో వైరల్...

తమ డబ్బులు పోవడంతో టిడిపి నేతలు ఆ విజయవాడ వాసులను నిర్బంధించి దుస్తులు తీసివేసి తీవ్రంగా కొట్టారు. పేకాట శిబిరంపై నిర్వాహకులు గంజి మహేష్ బూతులు తిడుతూ కొడుతుండగా అతని అనుచరులు వీడియో తీశారు.

news18-telugu
Updated: January 21, 2020, 5:52 PM IST
పేకాట వివాదం.. విజయవాడ వాసులపై టీడీపీ కార్యకర్తల దాడి... బట్టలు ఊడదీసిన వీడియో వైరల్...
నమూనా చిత్రం
  • Share this:
పశ్చిమ గోదావరి జిల్లా లో టిడిపి నేతలు అరాచకం సృష్టించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట శిబిరంలో డబ్బులు గెలుచుకున్న విజయవాడ వాసులను దుస్తులు తీసేసి కొట్టారు. సంక్రాంతి సందర్భంగా పొలసానిపల్లి లో పేకాట శిబిరం ఏర్పాటు చేశారు. దీనికి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వీరాంజనేయులు సోదరుడు గోపాలం స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి తీసుకున్నారని సమాచారం. ఈ శిబిరంలో పేకాట ఆడేందుకు గన్ని వీరాంజనేయులు వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న భూపతి రాజు అమర్నాథ్ వర్మ విజయవాడ నుంచి ఐదుగురు స్నేహితులను తీసుకువచ్చారు. 16న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పేకాటలో సుమారు రూ.8 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. అయితే తమ డబ్బులు పోవడంతో టిడిపి నేతలు ఆ విజయవాడ వాసులను నిర్బంధించి దుస్తులు తీసివేసి తీవ్రంగా కొట్టారు. పేకాట శిబిరంపై నిర్వాహకులు గంజి మహేష్ బూతులు తిడుతూ కొడుతుండగా అతని అనుచరులు వీడియో తీశారు. ఇప్పుడు ఆ వీడియోలు ఆలస్యంగా బయటకు రావడంతో టిడిపి నేతల అరాచకాలు బట్టబయలయ్యాయి. నిర్బంధంలో ఉన్న ఒకరు తన సెల్ఫోన్లో ఇంటికి సమాచారం ఇవ్వడంతో వారు పోలీసులకు విషయం చెప్పారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు