మరదలితో వివాహేతర సంబంధం.. టీడీపీ నేతకు జైలు శిక్ష..

ప్రతీకాత్మక చిత్రం

వివాహేతర సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది.

  • Share this:
    వివాహేతర సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్‌ మనస్తాపానికి గురై కిరోసిన్‌ పోసుకొని నిప్పటించుకుని మూడేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు.దీంతో మృతుని సోదరి పోలీసులను ఆశ్రయించింది. తన సోదరుడు చనిపోవడానికి టీడీపీ నేత ఈశ్వర్యయ్య కారణమని ఆమె ఆరోపించింది. తన అన్న భార్యతో ఈశ్వరయ్య వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అది తెలిసి తట్టుకోలేక తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నడని ఆమె పేర్కొంది.

    ఫిర్యాదు మేరకు బత్తలపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఈశ్వరయ్య, అతడి మరదలు రాధపై సెక్షన్‌ 306 కింద కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం రుజువైంది. దీంతో.. ముద్దాయిలు ఈశ్వరయ్య, రాధలకు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ధర్మవరం సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణమ్మ తీర్పునిచ్చారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: