టీడీపీ నేత దారుణ హత్య.. గొంతుకోసి చంపిన దుండగులు

మూడు రోజుల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఇది రెండో రాజకీయ హత్య కావడం విశేషం. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు.

news18-telugu
Updated: July 1, 2020, 9:23 PM IST
టీడీపీ నేత దారుణ హత్య.. గొంతుకోసి చంపిన దుండగులు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కృష్ణాజిల్లాలో మరో దారుణం జరిగింది. వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య ఘటన మరవక ముందే.. తాజాగా టీడీపీ నేత తాతా సాంబయ్య (35)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణ హత్య చేశారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక మండలం మెరకాపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెదగౌడపాలెం గ్రామానికి చెందిన తాతా సాంబయ్య నాగాయలంక నుంచి ఇంటికి బైక్‌పై వెళ్తుండగా దుండుగులు అడ్డగించి హత్యచేశారు. గొంతుకోసి దారుణంగా చంపేశారు. రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలారు సాంబయ్య. మృతుడు పర్రచివర గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అంతేకాదు ఎంపిటిసి అభ్యర్థిగా ఆయన బరిలో ఉన్నారు.

మూడు రోజుల వ్యవధిలో కృష్ణా జిల్లాలో ఇది రెండో రాజకీయ హత్య కావడం విశేషం. రెండు రోజుల క్రితం మచిలీపట్నంలో వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని ముఖ్య అనచరుడు మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన మార్కెట్‌లో ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. దుండగుడి దాడిలో తీవ్ర గాయాలపాలైన భాస్కరరావును స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన మృతి మంత్రి పేర్నినాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ప్రత్యర్థులు చంపేశారని ఆరోపించారు.
First published: July 1, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading