Yamini Sadineni: ఫేక్ facebook అకౌంట్లపై సాధినేని యామిని ఫిర్యాదు.. అసభ్యకర పోస్టులంటూ..

Yamini Sadineni: తన పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతూ అవమానిస్తున్నారని సాధినేని యామిని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 10, 2019, 2:35 PM IST
Yamini Sadineni: ఫేక్ facebook అకౌంట్లపై సాధినేని యామిని ఫిర్యాదు.. అసభ్యకర పోస్టులంటూ..
సాధినేని యామిని (ఫైల్ ఫోటో)
  • Share this:
ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్లపై టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు మీద అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతూ అవమానిస్తున్నారని ఆమె తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ ఎక్కువైందని, యామిని పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి తన ఫోటో, టీడీపీ అధినేత చంద్రబాబు , లోకేశ్, ఎన్టీఆర్ ఫొటోలు పెట్టి అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆమె ఆరోపించారు. దీనిపై గతంలో రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా అసభ్యకర పోస్టులు ఆగలేగడం లేదని తెలిపారు.

ఈ మధ్య ఏపీ సీఎం YS జగన్మోహన్ రెడ్డి, ప్రధాన మంత్రి మోదీ ఫొటోలతో అసభ్యకరంగా పోస్టులు పెట్టి, తనకు అపవాదు తెస్తున్నారని వాపోయారు. ఇక, తన ఫోన్ నెంబర్, తన భర్త ఫోన్ నంబర్ సేకరించిన గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అవసరమైతే, స్వయంగా సీఎంను కలిసి వివరిస్తానని చెప్పారు. సైబర్ చట్టాలను మరింత కఠినతరం చేయాలని ఆమె ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



First published: June 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు