మహిళల ముందు జిప్ తీసి... టాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన

తన టాక్సీలో ప్రయాణం సాగించిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఓ టాక్సీ డ్రైవర్.

news18-telugu
Updated: July 2, 2019, 7:42 PM IST
మహిళల ముందు జిప్ తీసి... టాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: July 2, 2019, 7:42 PM IST
మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా వారి పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఘటన కూడా ఇలాంటిదే. ఇంటి నుంచి మరో చోటికి వెళ్లేందుకు టాక్సీ బుక్ చేసుకున్న ఓ మహిళ... టాక్సీ డ్రైవర్ అసభ్య చేష్టలకు అస్సలు తట్టుకోలేకపోయిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చెల్లి, తల్లితో కలిసి దాదర్ నుంచి నారీమెన్ పాయింట్‌కు వెళ్లేందుకు టాక్సీ బుక్ చేసుకున్న ఓ మహిళ... టాక్సీ డ్రైవర్ చేష్టలకు నిర్ఘాంతపోయింది. ప్యాంట్ జిప్ తీసి మహిళ వైపు చూస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు సదరు టాక్సీ డ్రైవర్.

రెండు మూడు సార్లు ఇదే రకంగా వ్యవహరించాడు. కార్లులో ఉన్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సిగ్నల్ పడిన చోటల్లా అతడి తీరు ఇలాగే ఉండటంతో... కారులో మహిళలు తట్టుకోలేకపోయారు. తనవాళ్లతో కలిసి మధ్యలోనే యువతి కారు దిగిపోయింది. వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఘటనకు సంబంధించి ఫిర్యాదు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజ్‌ను సైతం పోలీసులకు సదరు మహిళ ఇచ్చింది. అయితే ఇప్పటికీ టాక్సీ డ్రైవర్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.


First published: July 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...