news18-telugu
Updated: May 19, 2020, 10:52 AM IST
1600 సారా ఊట ధ్వంసం...180 లీటర్ల నాటు సారా స్వాధీనం..
చిత్తూరు జిల్లా పీలేరు : వాల్మీకిపురం మండలం చింతపర్తి పంచాయతీ పరిధిలోని మేకల వారి పల్లె లో టాస్క్ ఫోర్స్ పోలీసులు విస్తృత దాడులు నిర్వహించి పదహారు వందల నాటుసారా ఊటను ధ్వంసం చేయడంతో పాటు 180 లీటర్ల నాటు సారాను స్వాధీనపరచు కొనునట్లు ఆర్ ఐ వీరేష్ వాల్మీకిపురం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తమకు అందిన రహస్య సమాచారం మేరకు మేకల వారి పల్లెలో పెద్ద ఎత్తున నాటు సారా తయారు చేసి పొరుగున ఉన్న మదనపల్లె తిరుపతి పట్టణాలకు తరలించేందుకు సమీప పొలాల్లో దాచి ఉంచిన నాటు సారా, నాటు సారా ఊటను టాస్క్ ఫోర్స్ పోలీసులు ధ్వంసం చేసి పొలాల్లో దాచి ఉంచిన ఆరు బస్తాల తుమ్మ చక్కను కూడా స్వాధీన పరుచుకున్నట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Published by:
Venu Gopal
First published:
May 19, 2020, 10:52 AM IST