2,88,000రూ. విలువ గల నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

నకిలీ విత్తనాలను రైతులకు అమ్ముతూ..పట్టుబడ్డ ముఠా అరెస్ట్

నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

 • Share this:
  కరీంనగర్ జిల్లా:  2,88,000/- విలువ గల1-క్వింటాల్ 44-కిలో నకిలీ పత్తి విత్తనాలతో పాటు ఆటో(TS-36T-6117 ) స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.
  గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు తిమ్మాపూర్ పోలీస్ వారు ఇట్టి దందా చేస్తున్న నిందితులను పట్టుకోవడం జరిగింది. ముగ్గురు నిందితులను విచారణ నిమ్మిత్తం తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వీరందరూ ఒకే ముఠాగా ఏర్పడి నకిలీ విత్తనాలను రైతులకు అమ్ముతూ వారిని మోసం చేసి అధిక డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని, గత కొన్ని రోజులుగా కరీంనగర్ జిల్లా మరియు సిద్దిపేట్ జిల్లా ప్రాంతాల్లలో నాసిరఖం పత్తి విత్తనాలను చుట్టూ పక్కల జిల్లాలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తూ దందా కొనసాగిస్తూ వస్తున్నారు .

  కరీంనగర్ మరియు సిద్దిపేట్ జిల్లాలకు గుట్టు చప్పుడు కాకుండా సప్లై చేస్తూ అధిక ధరలకు అమ్మి అమాయక రైతులను మోసం చేస్తూ,ధనార్జన చేస్తున్నారు.తిమ్మాపూర్ బస్సు స్టాండ్ సమీపంలో టాస్క్ ఫోర్స్ మరియు తిమ్మాపూర్ పోలీస్ వారు వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఆటో (TS-36T-6117) ను తనిఖీ చేయగా పత్తి విత్తనాలు దొరకడం తో వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించగా వారు పరిశీలించి పత్తి విత్తనాలు నకిలీవని ద్రువీకరించగా ఆటో తో సహా పట్టుబడ్డ వట్టి ఇన్నారెడ్డి , మిడిదొడ్డి రమేష్ మరియు గడిపర్తి నాగేశ్వర్ రావు లను విచారించగా వీరికి సిద్దిపేట్ జిల్లా బెజ్జంకి మండలం , శీలాపురం గ్రామానికి చెందిన బుర్ర సంతోష్ గౌడ్ వీరికి పత్తి విత్తనాలను సరఫరా చేసినట్లుగా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం సంతోష్ గౌడ్ పరారీలో ఉన్నాడు.
  Published by:Venu Gopal
  First published: