తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ స్మగ్లర్..

స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు.. వారిని చాకచక్యంగా పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన స్మగ్లర్స్ పారిపోయారు. కూంబింగ్‌కు వెళ్లిన అధికారులకు ఒక స్మగ్లర్ మాత్రం పట్టుబడ్డాడు.

news18-telugu
Updated: October 11, 2018, 8:10 AM IST
తిరుపతిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ స్మగ్లర్..
టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ స్మగ్లర్..
  • Share this:
తిరుపతి కరకంబాడీలోని హరిత కాలనీలో గురువారం ఉదయం టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. కూంబింగ్ కోసం వెళ్లిన అధికారులు.. అడవిలోకి పెద్ద ఎత్తున స్మగ్లర్లు చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారన్న విషయాన్ని పసిగట్టారు. వెంటనే స్మగ్లర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది తక్కువగా ఉండటంతో స్మగ్లర్లు వారిపై దాడికి యత్నించినట్టు తెలుస్తోంది.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌడ్లు కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో స్మగ్లర్స్ అంతా పారిపోగా.. ఒక్క వ్యక్తి మాత్రం పోలీసులకు పట్టుబడ్డాడు. అతన్ని తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లాకు చెందిన స్మగ్లర్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి భారీగా ఆహారపదార్థాలు, మద్యం, గుట్కా, బియ్యం, కూరగాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్ డీజీ శ్రీ డా.ఎం.కాంతారావు పరిశీలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Published by: Srinivas Mittapalli
First published: October 11, 2018, 8:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading