TANZANIAN CONTENT CREATOR KILI PAUL INTERNET SENSATION ATTACKED WITH KNIFE PAH
OMG: ఇంటర్నెట్ సంచలనం.. మన్ కీ బాత్ లో మోదీచే ప్రశంసలు అందుకున్న కిలీ పాల్ పై కత్తులతో దాడి..
ప్రధాని మోదీ, కిలిపాల్
Tanzanian content creator: టాంజానీయాకు చెందిన సోషల్ మీడియా స్టార్ కిలీపాల్ పై గుర్తు తెలియని దుండగుల కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈయన ప్రతిభకు గతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసలు కురిపించారు.
Kili Paul Internet Sensation Attacked With Knife: సోషల్ మీడియా స్టార్ టాంజానీయాకు చెందిన కిలీ పాల్ పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసినట్లు తన ఇన్ స్టాలో తెలిపారు. ఆయన తన సోదరి నీమాతో కలిసి అనేక అవగాహన కార్యక్రమాలు చేస్తు ఉంటారు. ప్రజల కోసం మంచి వీడియోలు చేస్తు.. వారిలో చైతన్యం నింపుతుంటారు. ఆయన తన ప్రత్యేక యూట్యూబ్ ఛానెల్ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తు ఉంటారు. ఈయన తన డ్యాన్సింగ్, వీడియోలతో తన కంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈయన చూపిన ప్రతిభకు గాను.. భారత్ హైకమిషనర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయనను అవార్డుతో సత్కరించింది. అదే విధంగా, ప్రధాని మోదీ కూడా కిలీపాల్ చూపిన ప్రతిభకు గాను మన్ కీ బాత్ లో ఆయనపై ప్రశంసలు కురిపించారు. అనేక భాషల్లో వీడియోలను తీశారు. కిలీపాల్ కు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోవింగ్ ను కల్గి ఉన్నారు. గత సంవత్సరం, సోదరి నీనా పాల్‌తో కలిసి సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ నటించిన "షేర్షా"లోని "రాతన్ లంబియాన్" పాటలో తన లిప్-సింక్ వీడియో తర్వాత వీరిద్దరు మంచి గుర్తింపును పొందారు.
అప్పటి నుండి, అతను అనేక వీడియోలను పోస్ట్ చేసాడు, అక్కడ కిలీపాల్ హిందీ సినిమాలలోని ప్రసిద్ధ పాటలకు లిప్-సింక్ చేస్తూ కనిపించాడు మరియు అది అతనికి ఇన్ స్టాలో 3.6 మిలియన్ల మంది అనుచరులను సంపాదించడంలో సహాయపడింది. అయితే, ఈ మధ్య గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడిచేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. తనకు కుట్లుకూడా పడ్డాయని తెలిపాడు. ప్రస్తుతం టాాంజానీయా అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.