హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime : తాంత్రికుడి దుశ్చర్య.. శృంగారం చేస్తున్న జంట హత్య.. ఫెవీక్విక్‌తో..

Crime : తాంత్రికుడి దుశ్చర్య.. శృంగారం చేస్తున్న జంట హత్య.. ఫెవీక్విక్‌తో..

పోలీసుల అదుపులో తాంత్రికుడు

పోలీసుల అదుపులో తాంత్రికుడు

Crime : సినిమాల ప్రేరణో, మరే కారణమో గానీ ఈమధ్య నేరాలు సరికొత్తగా జరుగుతున్నాయి. వాటిలో ట్విస్టులు ఊహకు అందని విధంగా ఉంటున్నాయి. ఓ తాంత్రికుడు చేసిన హత్యా నేరం అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏమైందో తెలుసుకుందాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  రాజస్థాన్.. ఉదయ్‌పూర్‌లో నవంబర్ 15న ఈ ఘటన జరిగింది. భదవిగూడలోని ఇచ్ఛాపూర్ణ శేషనాగ్‌ భావ్‌జీ మందిరంలో భలేశ్‌ కుమార్‌ అనే తాంత్రికుడు.. విచిత్రమైన పూజలు చేస్తూ ఉంటాడు. ఐతే.. అప్పుడప్పుడూ కొంతమంది అతని దగ్గరకు వచ్చి.. తాంత్రిక పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో.. 30 ఏళ్ల ఓ వివాహితుడు (టీచర్) ఒంటరిగా వచ్చి పూజలు చేయించుకుంటూ ఉండగా.. అదే సమయంలో ఓ 28 ఏళ్ల వివాహిత కూడా వచ్చి పూజలు చేయించుకుంది.

  ఆ వివాహితుడు, వివాహిత మధ్య పరిచయం ఏర్పడింది. అలా వారు తరచూ బాబా దగ్గరకు వస్తూ.. ఆ వంకతో కలుస్తున్నారు. ఇద్దరి మధ్యా వివాహేతర బంధం ఏర్పడింది. ఆ బంధం పెట్టుకోవద్దనీ.. అది తనపై చెడు ప్రభావం చూపిస్తుందని తాంత్రికుడు వాళ్లకు చెప్పాడు. కానీ వాళ్లు వినలేదు. దాంతో ఆగ్రహించిన తాంత్రికుడు.. వారి బంధాన్ని బట్టబయలు చేశాడు. అంతే.. రెండువైపులా కుటుంబాల్లో తీవ్ర రచ్చ రేగింది.

  తమ కాపురాల్లో చిచ్చు పెట్టాడన్న కోపంతో.. ఆ తాంత్రికుడిపై ఎక్కడలేని చెడు ప్రచారం చేసింది ఆ జంట. దాంతో.. తాంత్రికుడికి ఉన్న కాస్తో, కూస్తో మంచి పేరు పోయి.. చెడుగా ప్రచారం జరిగి.. భక్తుల రాక పూర్తిగా తగ్గిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ జంటకు తగిన శాస్తి చెయ్యాలి అనుకున్నాడు ఆ తాంత్రికుడు. వాళ్లిద్దర్నీ చంపేయడమే సరైన పరిష్కారం అనుకున్నాడు.

  వారితో మంచిగా మాట్లాడుతూ.. నవంబర్ 15న వారిని ఓ అడవికి రప్పించాడు. వారితో ఓ పూజ చేయించి.. కాసేపు పూజలో ఉండి.. తర్వాత ఇద్దరూ సెక్స్ చేసుకోండి అని చెప్పి తాను వెళ్లిపోయాడు. కాసేపు పూజలో ఉన్న ఆ జంట ఆ తర్వాత.. శృంగారం ప్రారంభించింది. వెళ్లిపోయినట్లు నటించిన తాంత్రికుడు.. చెట్ల చాటున దాక్కున్నాడు. ఒక్కసారిగా వాళ్లపై ఓ సీసాలో ఉంచిన.. 50 ప్యాకెట్ల ఫెవీక్విక్‌ని పోసేశాడు. దాంతో వారి శరీరాలు అతుక్కుపోయాయి. వెంటనే తాంత్రికుడు అతని గొంతు, జననాంగాలను కోసేశాడు. కత్తితో పొడిచాడు. అతను చనిపోయాక.. మహిళనూ పొడిచి చంపేశాడు.

  పిల్లాడిపై కోడిపుంజు దాడి.. ఓనర్‌పై కేసు నమోదు..

  మూడు రోజుల తర్వాత అటుగా వెళ్తున్న కొందరు మృతదేహాల్ని చూసి.. పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఐతే.. సీసీటీవీ ఫుటేజ్‌ని గమనించి.. అడవిలోకి వెళ్తున్న తాంత్రికుడిని గుర్తించి.. ఎస్పీ వికాస్ కుమార్ టీమ్ అరెస్టు చేసింది. ఇలా ఈ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో.. పోలీసుల్నే ఆశ్చర్యపరిచింది.

  Published by:Kumar Krishna
  First published:

  Tags: Crime news, Rajasthan