గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు.. తిరగబడి దాడి చేసిన తండావాసులు

ఎక్సైజ్ పోలీసులను పరామర్శిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ఒంటిగుడిసె తండాలో నాటుసారా తయారీ చేస్తోన్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. దీంతో ఆ తండా వాసులు ఒక్కసారిగా ఎక్సైజ్ పోలీసులపై తిరగబడి దాడి చేశారు.

  • Share this:
    కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వల్ల మద్యం దుకాణాలను పూర్తిగా మూసేశారు. దీంతో గత 40 రోజులుగా మద్యం దొరక్క మందుబాబులు అల్లాడిపోతున్నారు. దీంతో నాటుసారాకు డిమాండ్ పెరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల నాటుసారా తయారీ దాదాపుగా రాష్ట్రంలో నిలిచిపోయింది. లాక్‌డౌన్ ముందు వరకు ఎక్కడో ఒకచోట మాత్రమే నాటుసారా కన్పిచేంది. కానీ లాక్‌డౌన్ పుణ్యమాంటూ నాటుసారా తయారీ మళ్లీ మొదలయ్యింది. మత్తుకు బానిసైన చాలామంది మద్యం దొరక్కపోవడంతో నాటుసారా తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈక్రమంలో గుడుంబా తయారీ రాష్ట్రంలో మళ్లీ గుప్పుమంటోంది. అయితే ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి నాటుసారా తయారీ స్థావరాలను ధ్వంసం చేస్తున్నా.. సారా తయారీ మాత్రం ఆగడం లేదు.

    అయితే తాజాగా మమబూబ్ నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ గ్రామపంచాయతీ పరిధి ఒంటిగుడిసె తండాలో నాటుసారా తయారీ చేస్తోన్న స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. దీంతో ఆ తండా వాసులు ఒక్కసారిగా ఎక్సైజ్ పోలీసులపై తిరగబడి దాడి చేశారు. తండావాసులు చేసిన దాడిలో ఎక్సైజ్ సీఐ బాలాజీ, ఇద్దరు కానిస్టేబుల్స్‌కు గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ సిబ్బందిని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పరామర్శించారు.
    Published by:Narsimha Badhini
    First published: