హోమ్ /వార్తలు /క్రైమ్ /

కదిలే కారులోంచి భార్యను తోసేసిన భర్త... ఆమె చేసిన తప్పేంటి?

కదిలే కారులోంచి భార్యను తోసేసిన భర్త... ఆమె చేసిన తప్పేంటి?

Tamilnadu : ఇంజినీర్ అయిన అమల్‌రాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన్ని ఇంతవరకూ అరెస్టు చెయ్యలేదు. అమల్‌రాజ్, అతని తల్లిదండ్రులూ నెల నుంచీ కనిపించట్లేదు.

Tamilnadu : ఇంజినీర్ అయిన అమల్‌రాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన్ని ఇంతవరకూ అరెస్టు చెయ్యలేదు. అమల్‌రాజ్, అతని తల్లిదండ్రులూ నెల నుంచీ కనిపించట్లేదు.

Tamilnadu : ఇంజినీర్ అయిన అమల్‌రాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన్ని ఇంతవరకూ అరెస్టు చెయ్యలేదు. అమల్‌రాజ్, అతని తల్లిదండ్రులూ నెల నుంచీ కనిపించట్లేదు.

కోయంబత్తూర్ ‌లోని అదో వీధి. అక్కడ ఓ కదిలే కారు లోంచీ ఓ మహిళను బలవంతంగా కిందికి తోసేశారు ఆమె భర్త, అత్తమామలు. ఆమెను చంపేసే ఉద్దేశంతో నెల కిందట చేసిన ఈ దారుణం... సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 38 ఏళ్ల ఆర్తీ అరుణ్‌ను చక్కగా చూసుకుంటానంటూ... ఆమెను నెల కిందట పుట్టింటి నుంచీ అత్తారింటికి తీసుకెళ్లాడు భర్త అమల్‌రాజ్. తీరా ఇంటికి తీసుకెళ్లాక ఆమెను చితకబాదాడు. 2008లో అమల్‌రాజ్, ఆర్తీకి పెళ్లైంది. ఇద్దరు పిల్లలు. కాపురం సవ్యంగా సాగలేదు. ఎప్పుడూ గొడవలే. ఆరేళ్ల తర్వాత భర్తను వదిలేసిన ఆర్తీ... 2014లో ముంబైలోని తన పేరెంట్స్ ఇంటికి వెళ్లిపోయింది. విడాకులకు పిటిషన్ వేసింది. కాళ్లబేరానికి వచ్చాడు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ఆమె వేసిన గృహ హింస కేసు, విడాకుల పిటిషన్ పెండింగ్‌లో ఉండిపోయాయి. ఐదేళ్ల తర్వాత భర్తపై జాలిపడిన ఆమె... తిరిగి అత్తారింటికి వెళ్లింది.

మేలో హాలిడే ట్రిప్ కింద... ఫ్యామిలీ మొత్తం ఊటీ వెళ్లారు. తీరా అక్కడికెళ్లాక నరకం చూపించాడు. ఆమెనూ, ఆమె పిల్లల్నీ అడ్డమైన తిట్లు తిట్టాడు. వెంటనే ఊటీలో తన భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసుల ముందు లిఖితపూర్వక క్షమాపణ చెప్పడంతో... భర్తతో కలిసి ఊటీ నుంచీ అత్తారింటికి బయల్దేరింది. ఐతే... అత్తమామల్ని ఆమెకు దూరంగా ఉంచుతానని లిఖితపూర్వక హామీ ఇచ్చిన అమల్‌రాజ్... అదే కారులో వాళ్లను కూడా ఎక్కించాడు.

కారులో వెళ్తూ... మీ పేరెంట్స్‌ని కారులో ఎందుకు ఎక్కనిచ్చారని అడిగింది. అంతే... ఆమెను పిడిగుద్దులు గుద్దాడు. నిన్ను చంపేస్తా అంటూ... వేగంగా కారును తీసుకొచ్చి... ఆర్తీ సోదరి ఇంటి బయట కదిలే కారులోంచీ ఆర్తీని రోడ్డుపైకి తోసేశాడు. ఆమె తల, భుజాలు, మోకాళ్లకు గాయాలయ్యాయి.

ప్రస్తుతం ముంబైలో ఉంటున్న ఆర్తీ... తననూ, తన కొడుకులనూ చంపేయాలని చూస్తున్నారని అమల్‌రాజ్, అతని పేరెంట్స్‌పై ఆరోపణలు చేస్తున్నారు. తన కొడుకు చదువుతున్న స్కూల్ దగ్గరకు అమల్‌రాజ్ వచ్చాడనీ, ఇలాగైతే తాను ఎలా బతకగలనని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు మాత్రం అతను పరారీలో ఉన్నాడని చెబుతున్నారనీ, తనకు న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంజినీర్ అయిన అమల్‌రాజ్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఆయన్ని ఇంతవరకూ అరెస్టు చెయ్యలేదు. అమల్‌రాజ్, అతని తల్లిదండ్రులూ నెల నుంచీ కనిపించట్లేదు. పోలీసులు మాత్రం నెల నుంచీ కేసు దర్యాప్తు చేస్తున్నామనీ, వారికోసం వెతుకుతున్నామనీ చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి :

కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

న్యూయార్క్ మాన్‌హట్టన్ భవనంపై హెలికాప్టర్ ప్రమాదం... పైలట్ మృతి

మీసాలు ట్రిమ్... షర్టులు టక్... ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా కండీషన్లు...

First published:

Tags: Case, Coimbatore S22p20, Crime, Police, Tamilnadu

ఉత్తమ కథలు