Home /News /crime /

TAMILNADU POLYTECHNIC STUDENT ENDS HIS LIFE AFTER MONEY LENDER TOOK HIS GOAT SK

Tamilnadu: మేకను ఎత్తుకెళ్లిన అప్పులోళ్లు.. మనస్థాపంతో పాలిటెక్నిక్ స్టూడెంట్ ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Loan lender Harassments: 19 ఏళ్ల యువకుడు అప్పులోళ్ల వేధింపులకు బలయ్యాడు. ఇంటికి వచ్చి దూషించడమే కాకుండా.. తనకు ఎంతో ఇష్టమైన మేకను తీసుకెళ్లడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  అప్పులోళ్ల వేధింపుల (Loan lenders Harassments) తో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా తమిళనాడు (Tamilnadu)లో దారుణం జరిగింది. 19 ఏళ్ల యువకుడు అప్పులోళ్ల వేధింపులకు బలయ్యాడు. ఇంటికి వచ్చి దూషించడమే కాకుండా.. తనకు ఎంతో ఇష్టమైన మేకను తీసుకెళ్లడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సేలం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా వెల్లైకురాడుకు చెందిన ఆనందన్ కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు నిర్మల్ రాజ్ అనే కుమారుడు ఉన్నాడు. నిర్మల్ రాజ్ వయసు 19 ఏళ్లు. పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మరో మూడేళ్లు గడిస్తే.. కుమారుడి చదువు పూర్తయి.. ఉద్యోగం వస్తుందని.. అప్పుడు తమ జీవితాలు బాగుపడతాయని ఆనందన్ కలలు కన్నాడు. కానీ అంతలోనే ఘోరం జరిగింది. నిర్మల్ రాజ్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. దీనికి తన తండ్రి గతంలో చేసిన అప్పే కారణం. ఐదేళ్ల క్రితం నిర్మల్ రాజ్ అనారోగ్యానికి గురవడంతో అతడి తండ్రి ఆనందన్.. సుధాకర్ అనే వ్యక్తి వద్ద రూ.65 వేలు అప్పు తీసుకున్నాడు. అప్పటి నుండి వడ్డీ కడుతున్నాడు. వడ్డీ రూపంలో ఇప్పటి వరకు రూ.50వేలు చెల్లించాడు. ఐతే అసలు డబ్బులు చెల్లించకపోవడంతో ఆనందన్‌తో రెండు మూడు సార్లు గొడవపెట్టుకున్నాడు సుధాకర్.  ఐనప్పటికీ ఆనందన్ డబ్బులు ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి సుధాకర్ తన తల్లి సరస్వతితో కలిసి ఆనందన్ ఇంటికి వెళ్లాడు. డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ప్రస్తుతం నా వద్ద డబ్బులు లేవు.. తర్వాత ఇస్తానని చెప్పడంతో.. సుధాకర్ రెచ్చిపోయాడు. ఆనందన్‌ను ఇష్టానుసారం తిట్టాడు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం సుధాకర్.. ఆనందన్ ఇంట్లో ఉన్న ఓ మేకను తమ వెంట తీసుకెళ్లాడు. ఐతే ఆ మేక ఆనందన్ కుమారుడు నిర్మల్ రాజ్‌కు ఎంతో ఇష్టం. దాని బాగోగులను అతడే చూసుకునేవాడు. తన మేకను సుధాకర్ పట్టుకెళ్లడంతో నిర్మల్ రాజ్ మనస్థాపానికి గురయ్యాడు. మరుసటి రోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సుధాకర్, అతడి తల్లి వేధించడం వల్లే తన కుమారుడు మరణించాడని ఆనందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సుధాకర్, అతడి తల్లి సరస్వతిని అరెస్ట్ చేశారు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 294 (బీ), 306 అభియోగాలు మోపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని పోలీసులు వెల్లడించారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Crime, Crime news, Loan lenders, Tamilnadu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు