హోమ్ /వార్తలు /క్రైమ్ /

వామ్మో కిలేడీ.. పెళ్లి చేసుకొని.. డబ్బు, నగలతో పారిపోయింది.. స్కెచ్ మామూలుగా లేదు

వామ్మో కిలేడీ.. పెళ్లి చేసుకొని.. డబ్బు, నగలతో పారిపోయింది.. స్కెచ్ మామూలుగా లేదు

నిత్యపెళ్లికూతురు

నిత్యపెళ్లికూతురు

ఇలాంటి మాయలేడీలు మన మధ్యే ఉంటారు. వీళ్ల స్కెచ్ మామూలుగా ఉండదు. పొరపాటున నమ్మామా.. నట్టేట మునిగినట్లే. అలా ఇప్పటికే నలుగుర్ని ముంచిన ఈ సుందరాంగి.. తాజాగా మరో అమాయకుణ్ని ఓ రేంజ్‌లో ముంచింది. తర్వాతేమైందో తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఫొటోలో అమ్మాయిని చూశారుగా.. అమాయకంగా కనిపిస్తోంది కదూ.. నిజానికి పెద్ద కిలాడీ. పేరు అభినయ. పేరుకు తగ్గట్టే అభినయం ప్రదర్శించడంలో టాలీవుడ్ నటీమణులకు ఏమాత్రం తగ్గదు. అందుకే కదా ఐదుగురు మగాళ్లను ముంచగలిగింది. తమిళనాడు మధురైకి చెందిన 28 ఏళ్ల అభినయ.. ఈమధ్య తంబారా రంగనాథపురానికి చెందిన నటరాజన్‌ని పెళ్లి చేసుకుంది. తనకు పెళ్లైపోయిందని నటరాజన్ ఎంతో నఆనందపడ్డాడు. ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. సడెన్‌గా మాయమైంది. ఏమైందా అని అనుకున్నాడు. బీరువాలో చూస్తే 17 రకాల నగలు లేవు. సిల్క్ శారీస్ లేవు. రూ.20వేల మనీ కూడా లేదు. అప్పుడర్థమైంది. డబ్బు, నగలతో చెక్కేసిందని.

పోలీసుల్ని కలిసిన నటరాజన్.. విషయం చెప్పాడు. ఏం చేసైనా ఆమెను పట్టుకోండి సార్.. ఇలాంటి వాళ్లను తేలిగ్గా వదలకూడదు అన్నాడు. డోంట్ వర్రీ అన్న పోలీసులు యాక్షన్ లోకి దిగారు.

నటరాజన్ ఓ ఫుడ్ సప్లై సంస్థలో ఉద్యోగి. కొన్ని నెలల కిందట ముడిచూర్ బేకరీకి వెళ్లి టీ తాగుతుంటే.. అక్కడ పనిచేస్తున్న అభినయ.. ఓ నవ్వు నవ్వి.. నాలుగు బిస్కెట్లు వేసింది. పడిపోయాడు. ఓ సాంగ్ వేసుకున్నాడు. కట్ చేస్తే.. ఆగస్ట్‌లో పెళ్లైంది. అక్టోబర్ 19న మాయమైంది.

పోలీసులు తక్కువోళ్లు కాదు కదా.. అభినయ ఫోన్ నంబర్‌ను కంటిన్యూగా ట్రాక్ చేస్తూ ఉన్నారు. దాదాపు నెలకు పైగా స్విచ్ఛాఫ్ చేసిన మాయలేడి.. తాజాగా ఆన్ చేసి.. ఎవర్నో బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నించసాగింది. పోలీసులకు విషయం అర్థమైంది. ఆమె మహాబలిపురంలో మరెవర్నో బలిచేసేందుకు ఓ హోటల్‌లో ఉందని గ్రహించారు. ఆలస్యం చెయ్యకుండా వెళ్లి.. ఆమెను అరెస్టు చేశారు. ఆమెను దర్యాప్తు చేస్తున్న సమయంలో.. పోలీసులకు దిమ్మతిరిగే విషయం తెలిసింది. ఈ టక్కులాడి.. మరో ముగ్గుర్ని ఇలాగే పెళ్లి చేసుకొని మోసం చేసింది. అందరితోనూ ప్రేమాయణం నడిపింది. దటీజ్ అభినయ అనిపించుకుంది.

నిత్య పెళ్లికూతురు :

అభినయ నిత్య పెళ్లికూతురు. 2011లో మన్నగుడికి చెందిన కుర్రాణ్ని పెళ్లి చేసుకొని పది రోజుల తర్వాత మాయమైంది. ఆ తర్వాత మధురైలో మరో వ్యక్తిని చేసుకుంది. వాళ్లకు ఎనిమిదేళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. కానీ మాయమైంది. తర్వాత కొలంబాక్కమ్‌లో మరో వ్యక్తిని చేసుకొని.. పది రోజుల తర్వాత పారిపోయింది. నెక్ట్స్ నటరాజన్‌ని ముంచింది. ఈమె ఎంత డేంజరస్ అంటే.. ఈమె దగ్గర 32 సిమ్ కార్డులున్నాయి. దీన్ని బట్టీ మనం అంచనా వేసుకోవచ్చు ఎలాంటిదో. మగాళ్లూ జాగ్రత్త మరి. అమ్మాయిలంతా మంచివాళ్లే ఉండరు. అక్కడక్కడా ఇలాంటి వాళ్లు కూడా ఉంటారు. అప్రమత్తంగా లేకపోతే.. సర్వం ఊడ్చేస్తారు.

First published:

Tags: Crime news

ఉత్తమ కథలు