హోమ్ /వార్తలు /క్రైమ్ /

ఓలా డ్రైవర్ అరాచయం.. వన్ టైమ్ పాస్ వర్డ్ లేటుగా చెప్పాడని.. ఎంత పనిచేశాడు..

ఓలా డ్రైవర్ అరాచయం.. వన్ టైమ్ పాస్ వర్డ్ లేటుగా చెప్పాడని.. ఎంత పనిచేశాడు..

ఓలా కారు

ఓలా కారు

Tamil nadu: రైడర్ వన్ టైమ్ పాస్ వర్డ్ ఆలస్యంగా చెప్పాడని డ్రైవర్ కి, రైడర్ కి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి కొట్టుకొవడం వరకు వచ్చింది.

కొందరు చిన్నపాటి విషయాలకే కోపం తెచ్చుకుంటారు. మనం తరచుగా రోడ్డుమీద కొన్ని సంఘటనలను చూస్తుంటాం. కొంత మంది వాహన దారులు.. పొరపాటున మరో వెహికిల్ తాకిన, అనుకోకుండా ఏదైన జరిగిన తెగ ఆవేశ పడిపోతుంటారు. కోపంలో నానా యాగిచేస్తారు. రోడ్డు మీదనే గొడవలకు దిగుతుంటారు. ఇలాంటి అనేక సంఘటనలను మనం తరచుగా చూస్తునే ఉంటాం. అయితే, ఇక్కడ ఒక ఓలా డ్రైవర్.. తాను.. బుక్ చేసిన రైడర్.. ఓటీపి చెప్పడం ఆలస్యమైందని అమానుషంగా ప్రవర్తించాడు.

పూర్తి వివరాలు.. తమిళనాడులో (Tamil nadu) దారుణ ఘటన జరిగింది. కోయంబత్తురులో.. ఉమేంద్ర అనే టెకీ తన భార్య, పిల్లలతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. అయితే, అక్కడ నుంచి మాల్ కు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఓలా క్యాబ్(Ola cab)  బుక్ చేసుకున్నాడు. అయితే, అతను క్యాబ్ రాగానే ఓనర్ కాస్త గందర గోళంగా మారాడు. ఓటీటీ విషయంల వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత.. కారు దిగిపోయేటప్పుడు ఓనర్.. గట్టిగా కారును తన్ని దిగాడు.

దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతొ డ్రైవర్ కంట్రోల్ తప్పాడు. ఉమేంద్ర అనే వ్యక్తిపై ఫోన్ ను విసిరి పదే పదే కొట్టాడు. దీంతో అతను కుప్పకూలిపడిపోయాడు. అతడిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అతడిని చూసిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ను అరెస్టు చేశారు.

ఇదిలా ఉండగా  జార్ఖండ్ లో (Jharkhand) దారుణ ఘటన జరిగింది.

డిప్యూటి కమిషనర్ కార్యాలయం అధికారుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి విందు కార్యక్రమం జరిగింది. దీనికి జార్ఖండ్ కు చెందిన ఐఏఎస్ అధికారి, కొంత మంది ఇంజనీరింగ్ విద్యార్థినులు, మరికొంత మంది అతిథులు హజరయ్యారు. అందరు పార్టీలో హుషారుగా పాల్గోన్నారు. మద్యం తాగారు. అయితే, కలెక్టర్, విద్యార్థి సింగిల్ గా ఉండటాన్ని చూశాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను లైంగికంగా (harassment)  వేధించాడు.

అయితే, యువతి ఇంటికి వెళ్లి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ క్రమంలో సోమవారం.. తనపై  కలెక్టర్ లైంగిక వేధింపులకు (female harassment) పాల్పడ్డాడని ఖుంటీ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై పార్టీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. పార్టీకి వచ్చిన ఇతరులకు కూడా విచారించారు. ప్రాథమికంగా విద్యార్థినిపై లైంగిక వేధింపులు వాస్తవమేనని వారు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. విద్యార్థినిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.

First published:

Tags: Crime news, Murder, Ola, Tamil nadu

ఉత్తమ కథలు