హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shocking : కొత్తగా పెళ్లయిన కూతురు,అల్లుడిని నరికి చంపిన తండ్రి!

Shocking : కొత్తగా పెళ్లయిన కూతురు,అల్లుడిని నరికి చంపిన తండ్రి!

నవదంపతుల హత్య

నవదంపతుల హత్య

Gruesome incident : తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిని,ఆమె భర్తని దారుణంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి. తూత్తుకుడిలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

Gruesome incident : తమిళనాడు(Tamilnadu)లో దారుణం జరిగింది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిని,ఆమె భర్తని దారుణంగా నరికి చంపేశాడు ఓ వ్యక్తి. తూత్తుకుడిలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతులను ఎట్టయపురం సమీపంలోని వీరపట్టి వద్ద గల జేవియర్ నగర్‌కు చెందిన ఎం రేష్మ (20), వి మాణిక్కరాజు (28)గా గుర్తించారు. తూత్తుకుడిలో సోమవారం ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తూత్తుకుడిలోని ఎట్టయపురంకి చెందిన ఎం ముత్తుకుట్టి(43)లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ముత్తుకుట్టికి రేష్మ అనే 20 ఏళ్ల కూతురు ఉంది. కోవిల్​పట్టిలో రేష్మ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అయితే తన ఏరియాలోనే నివసించే మాణిక్కరాజు అనే 28 ఏళ్ల యువకుడితో కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తోంది రేష్మ. వీరిద్దరికీ దూరపు చుట్టరికం సైతం ఉంది. వీరిద్దరి ప్రేమ గురించి మనికరాజ్​కు తెలిసింది. దీంతో తన కూతురికి మరొకరితో పెళ్లిని నిశ్చయించాడు ముత్తుకుట్టి. దీంతో రేష్మ జూన్ 28న మాణిక్కరాజుతో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తన కుమార్తె కనిపించడం లేదంటూ ముత్తుకుట్టి పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశాడు. వీరిద్దరూ మదురై సమీపంలోని తిరుమంగళంలో వివాహం చేసుకుని వారం రోజుల క్రితం వీరపట్టికి తిరిగి వచ్చినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

Crime News : రోజూ ఆమె ఇంటికి వెళ్లి కోరిక తీర్చమని టార్చర్ పెట్టాడు .. కుదరని చెప్పడంతో ..

సోమవారం దంపతులు ఒంటరిగా ఉన్న సమయంలో ముత్తుకుట్టి.. మాణిక్కరాజు ఇంట్లోకి చొరబడి కూతురు రేష్మ గొంతు కోసి, మాణిక్కరాజును కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటనలో నవ దంపతులిద్దరూ చనిపోయారని పోలీసులు తెలిపారు. ,ఈ పరువు హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. శవపరీక్షల కోసం మృతదేహాలను కోవిల్​పట్టి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మూడు గంటల్లోనే నిందితుడు ముతుకుట్టిని అరెస్ట్ చేశారు పోలీసులు.పెళ్లయిన తర్వాత పోలీసుల సమక్షంలోనే వారి తల్లిదండ్రులతో దంపతులు మాట్లాడినట్లు పోలీసులు అధికారి తెలిపారు. అయితే, ముత్తుకుట్టి చాలా అహంకారి అని, తన కుమార్తె మేజర్ అని మరియు ఆమె జీవితాన్ని తానే నిర్ణయించుకోగలదని అంగీకరించలేదని అధికారి తెలిపారు.

First published:

Tags: Honor Killing, Tamilnadu

ఉత్తమ కథలు