నా భార్యను పెళ్లి చేసుకోండి.. మాట్రిమోనిలో భర్త ప్రకటన.. ఇలాంటి వాడిని ఎక్కడా చూసి ఉండరు..

Tamilnadu: విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఓంకుమార్ తనలోని నీచ బుద్ధిని బయటపెట్టాడు. రెండు వారాల క్రితం మ్యాట్రిమొని వెబ్‌సైట్లో తన భార్య వివరాలను ఉంచి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు.

Tamilnadu: విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఓంకుమార్ తనలోని నీచ బుద్ధిని బయటపెట్టాడు. రెండు వారాల క్రితం మ్యాట్రిమొని వెబ్‌సైట్లో తన భార్య వివరాలను ఉంచి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు.

 • Share this:
  వారిద్దరు జీవితంపై కోటి ఆశలతో ఒక్కటయ్యారు. ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మొన్నటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. నిత్యం గొడవపడేవారు. పలుమార్లు పెద్దలు నచ్చజెప్పినా మార్పు రాలేదు. చివరకు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అన్నీ ఆలోచించుకున్న తర్వాత విడాకులకు దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఐతే విడాకులపై విచారణ జరుగుతున్న క్రమంలో అతడు తన భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. ఏ భర్తా చేయకూడని పనిచేశాడు. తన భార్యకు సంబంధించిన వివరాలను మాట్రిమోనిలో పోస్ట్ చేసి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదులో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో వేశారు. తమిళనాడు ఈ ఘటన వెలుగుచూసింది.

  Love Marriage: ఒకే కంపెనీలో పనిచేసే వీళ్లిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. కానీ.. పాపం..

  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌కి చెందిన యువతి(32)..  ఓంకుమార్‌(34) అనే యువకుడిని పెళ్లి చేసుకుంది.  2016లో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ దంపతులకు ప్రస్తుతం నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐత  కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఇందులో ఎవరిది తప్పో.. ఎవరిది ఒప్పో తెలియదు గానీ.. ఇద్దరి మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. పెద్దలు కలగజేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వినలేదు. కలిసి ఉండలేమని నిర్ణయించుకొని కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారు. తనకు విడాకులు కావాలనిని పూందమల్లి కోర్టులో ఓంకుమార్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో దానిపై విచారణ సాగుతోంది.

  Beer Psycho: బెడ్రూం నిండా ఖాళీ బీర్ బాటిల్స్.. బెడ్‌పై తప్ప.. ఈ ‘బీర్ సైకో’ ఏం చేశాడంటే..

  ఐతే విడాకుల కేసు కోర్టులో ఉండగానే ఓంకుమార్ తనలోని నీచ బుద్ధిని బయటపెట్టాడు. రెండు వారాల క్రితం మ్యాట్రిమొని వెబ్‌సైట్లో తన భార్య వివరాలను ఉంచి.. వరుడు కావలెను అని ప్రకటన ఇచ్చాడు. ఎవరికైనా ఆసక్తి ఉంటే యువతి తండ్రిని సంప్రదించాలని ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాడు. ఈ విషయాలేవీ ఆ మహిళ తరపు వారికి తెలియవు. కానీ ఇటీవల ఆమె తండ్రికి వరుసగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మ్యాట్రిమోనిలో యాడ్ పెట్టారు కదా.. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అడుగుతున్నారు.  వారు చెప్పిన విషయాలు విని ఆమెతో పాటు కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. దీనిపై ఆమె తండ్రి తిరువళ్లూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఆమె వివరాలను మ్యాట్రిమోనిలో పోస్ట్ చేసింది ఓంకుమారేనని పోలీసులు గుర్తించారు. బుధవారం అతడిని అరెస్ట్ చసి రిమాండ్‌కు తరలించారు.
  Published by:Shiva Kumar Addula
  First published: