అసాధారణ సెక్స్ కోరిన భర్త... చంపేసిన భార్య

చాలా మంది భర్తలు... తాము స్వేచ్ఛగా ఉంటూ... తమ భార్యలు మాత్రం... తమ చెప్పుచేతల్లో ఉండాలని అనుకుంటారు. ఈ కథలో ఏమైంది? భర్తను ఆమె ఎందుకు లేపేసింది?

news18-telugu
Updated: August 2, 2020, 9:03 AM IST
అసాధారణ సెక్స్ కోరిన భర్త... చంపేసిన భార్య
అసాధారణ సెక్స్ కోరిన భర్త... చంపేసిన భార్య
  • Share this:
అది... తమిళనాడు... మధురై. అక్కడ పోలీసులు ఓ మహిళను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆమె... తన భర్తను ఊపిరాడకుండా చేసి చంపేసింది. అతని పేరు సుధీర్. వయసు 34 ఏళ్లు. ఇంజినీర్. సర్వే డిపార్ట్‌మెంట్‌లో అధికారుల మధ్య సమన్వయం చేయడం అతని డ్యూటీ. ఐతే... హత్య జరిగిన ముందు రోజు రాత్రి సుధీర్ ఆమెను చితకబాదాడు. చివరకు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు కారణమేంటన్న అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. సుధీర్, ఆయన భార్య అరివుసెల్వం... తిరుమంగళంలో ఉంటున్నారు. వాళ్లిద్దరికీ 8 ఏళ్ల కిందట పెళ్లైంది. వాళ్లకు ఓ పాప ఉంది. అరివుసెల్వం ఓ ప్రభుత్వ స్కూల్లో టీచర్.

శుక్రవారం తెల్లవారు జాము సమయం... అరివుసెల్వం... తన భర్తను ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. బెడ్ పై నుంచి కింద పడ్డాడని... అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. మొదట డాక్టర్లు నిజమే అనుకొని... చెక్ చేశారు. అప్పటికే ఆయన చచ్చిపోయినట్లు తెలిసింది. అదే విషయం ఆమెతో చెప్పారు. అయ్యో... అంటూ ఆస్పత్రిలోనే ఏడ్చేసింది. డాక్టర్లు క్యాజువల్‌గా పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి వివరాలు తెలుసుకొని... పోస్ట్‌మార్టం చేయమన్నారు. అప్పుడు డాక్టర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే... సుధీర్ మర్మాంగాల (ప్రైవేట్ పార్ట్స్)పై గాయాలున్నాయి. సో... ఇది హత్య అని తేల్చారు.

అప్పటికే తిరుమంగళం పోలీసులు దర్యాప్తు ప్రారంభించేశారు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ గబగబా వచ్చి... ఎస్సై చెవిలో ఆ విషయం చెప్పేసరికి... "ఎస్సై అవునా... అంటూ... అర్థమైంది... నేను చూసుకుంటా" అని అక్కడ ఏడుస్తున్న ఆమె వైపు కాస్త కోపంగా చూశాడు. ఈ కేసులో మాకు కొన్ని అనుమానాలున్నాయి. మీరు స్టేషన్‌కి రావాలి అన్నాడు. ఆమె ఏడుపు ముఖం పెట్టి... "నేనా.. స్టేషనా.. ఎందుకు?" అంది. "ఇలాంటి కేసుల్లో ఇది మామూలే. జస్ట్ ఐదు నిమిషాల్లో అయిపోతుంది. ప్లీజ్ కోపరేట్ విత్ అజ్" అన్నాడు. సరే అంది. మహిళా కానిస్టేబుళ్లు వచ్చి... ఆమెను స్టేషన్‌కి తీసుకెళ్లారు.

స్టేషన్‌ లోపలికి ఆమెను తీసుకెళ్లాక... చెంపలు చెడా మడా వాయించినట్లు శబ్దాలొచ్చాయి. ఆ తర్వాత... ఆమెను ఎస్సై ముందుకు తెచ్చింది మహిళా కానిస్టేబుల్. "నా భర్తను నేనే చంపాను. ఇందుకు నా బంధువులు బాలామణి, సుమయ్యార్ సహకరించారు" అని నిజం చెప్పింది అరివుసెల్వం.

ఇదీ జరిగింది :
నీ భర్తను ముగ్గురూ కలిసి ఎందుకు చంపారు? అని అడిగితే... ఆమె సైలెంట్‌గా ఉందే తప్ప ఏమీ చెప్పలేదు. పక్కనున్న లేడీ కానిస్టేబుల్... మరోసారి లోపలికి తీసుకెళ్లమంటావా అని అడిగింది. ఎస్సై ఆ మహిళా కానిస్టేబుల్ వైపు చూస్తూ... అక్కర్లేదు అన్నట్లు సైగ చేశాడు. అరివుసెల్వం నోరు విప్పింది. "బుధవారం రాత్రి నా భర్త అసాధారణ సెక్స్ చేయమని కోరాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. నన్ను చితకబాదాడు. ఎందుకు ఒప్పుకోనో చూస్తానని బెదిరించాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. చాలా బాధపడ్డాను. తర్వాత తనను చంపేయాలని డిసైడయ్యాను. అదే విషయాన్ని బాలామణి, సుమయ్యార్‌లకు చెప్పాను. వాళ్లు కూడా అదే కరెక్ట్ అన్నారు. "మన ఇంటా వంటా లేని పాడు బుద్ధులు. ఇలాంటి వాటిని మొగ్గ దశలోనే తుంచేయాలి" అన్నారు. గురువారం రాత్రి పాలలో నిద్రమాత్రలు కలిపి భర్తకు ఇచ్చాను. తాగి నిద్రపోయాడు. తర్వాత... వాళ్లిద్దర్నీ పిలిచాను. వాళ్లు నా ఇంటికి వచ్చి... సుధీర తలకు ప్లాస్టిక్ కవర్ తొడిగారు. ముగ్గురం కలిసి ఊపిరాడకుండా చేసి చంపేశాం" అంది.

"చెప్పావుగా పద" అంటూ ఆమెను మహిళా కానిస్టేబుల్ తీసుకెళ్లబోతుంటే... ఎస్సై ఆపాడు. "ఊపిరాడకుండా చేసి చంపితే... ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఎందుకయ్యాయి?" అని అడిగాడు. ఆవేశంగా చూసిన అరువుసెల్వం... కళ్లు పెద్దవి చేసి చూస్తూ... సుమయ్యార్... తన భర్త ప్రైవేట్ పార్ట్స్‌పై దాడి చేసినట్లు చెప్పింది. కేసు మిస్టరీ వీడటంతో... పోలీసులు మరో కేసు డీల్ చేసే పనిలో పడ్డారు.
Published by: Krishna Kumar N
First published: August 2, 2020, 8:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading