మహిళా పోలీసు దారుణ హత్య.. తల్లిలేని వారిగా మిగిలిన ఇద్దరు పిల్లలు.. ఆ పని చేసింది మరెవరో కాదు..

ప్రతీకాత్మక చిత్రం

30 ఏళ్ల మహిళ పోలీసు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దీంతో ఆమె ఇద్దరు పిల్లలు తల్లిలేని వారిగా మిగిలారు.

 • Share this:
  30 ఏళ్ల మహిళ పోలీసు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని విరుదునగర్‌లో చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య విబేధాల కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన మహిళా పోలీసును భానుప్రియగా గుర్తించారు. వివరాలు.. భానుప్రియ విరుదునగర్‌ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఆమెకు ఐదేళ్ల క్రితం విఘ్నేష్‌తో వివాహం జరిగింది. అతడు తమిళనాడు స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. భానుప్రియ, విఘ్నేష్ దంపతులకు నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరి కుటుంబం.. విరుదునగర్ కులకరై ప్రాంతంలో నివసిస్తుంది.

  అయితే కొన్ని సమస్యలు.. భానుప్రియ, విఘ్నేష్‌ల మధ్య వాగ్వాదానికి దారితీశాయి. ఈ క్రమంలోనే విఘ్నేష్ మధురైకి ఇంటిని మార్చాలని అనుకున్నాడు. అయితే భానుప్రియ అందుకు సిద్ధంగా లేదు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ వచ్చాయి. శుక్రవారం రాత్రి కూడా భానుప్రియ, విఘ్నేష్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయలో తీవ్ర ఆవేశానికి లోనైన విఘ్నేష్.. భానుప్రియ గొంతుకు బెల్ట్ బిగించి హత్య చేశాడు.

  చదవండి: తాలిబన్లకు మద్దతుగా పోస్ట్‌లు.. 15 మంది అరెస్ట్.. అరెస్ట్ అయిన వారిలో పోలీసుతో పాటుగా..

  Vijayawada: అనుమానస్పద స్థితిలో మహిళా సీఏ మృతి.. అతడే కారణం అంటున్న తల్లిదండ్రులు


  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. నిందితుడు విఘ్నేష్‌ను అరెస్ట్ చేశారు. భానుప్రియ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వరకట్నం కోసం మృతురాలిని వేధించాడా..? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: