Home /News /crime /

TAMIL NADU WOMAN CONFESSES TO KILLING HER FATHER IN LAW OVER SEXUAL HARASSMENT SU

ఆనందంగా సాగిపోతున్న జీవితం.. ఊహించని పరిణామాల నేపథ్యంలో జరిగిన హత్య.. ఆమె చెప్పకపోతే ఎవరికి తెలిసేదే కాదు..

కనిమొళి

కనిమొళి

మురుగేశన్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మురుగేశన్ మరణించాడు. అయితే ఇది సహజ మరణమని భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తిచేశారు.

    ఆమెకు నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఊహించని షాక్‌ తాగిలింది. ఆమెకు తన మామ నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. రోజురోజుకు వేధింపులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలోనే ఆమె తన మామను హత్య చేసింది. అయితే అది సహజ మరణమని అంతా భావించారు. కానీ కొద్ది రోజుల తర్వాత మహిళ నేరాన్ని అంగీకరించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. కీలకుళం పంచాయితీలోని కేలాల్ గ్రామానికి చెందిన కనిమొళి, వినోబ రాజన్ నాలుగేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల గడిచిన వారికి సంతానం కలగలేదు.

    ఇక, వినోబ రాజన్ తండ్రి మురుగేశన్.. వారితో పాటే ఉండేవాడు. అయితే ఇటీవలి కాలంలో మురుగేశన్.. కోడలు కనిమొళిని లైంగికంగా వేధించండం మొదలుపెట్టాడు. అయితే అతని వేధింపులను కనిమొళి తట్టుకోలేకపోయింది. భర్త ఇంట్లో లేని సమయంలో మురుగేశన్.. ఇలా వేధించడంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది. ఈ విషయాన్ని భర్తకు కూడా చెప్పింది. అయితే అతడు పట్టించుకోలేదని తెలుస్తోంది.

    మరోవైపు మురుగేశన్ నుంచి కనిమొళికి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె మామను హత్య చేయాలనే నిర్ణయానికి వచ్చింది. జూలై 31న రాత్రి మామ ఆహారంలో ఒక రకమైన విష పదార్థం కలిపి ఇచ్చింది. దీంతో అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. అంతేకాకుండా కడుపు నొప్పి, విరేచనాలు బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతూ మరుసటి రోజే మృతిచెందాడు. అయితే కుటుంబ సభ్యులకు ఎటువంటి అనుమానం లేకపోవడంతో.. సహజ మరణం అని భావించారు. ఇందుకు సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. అంత్యక్రియలు పూర్తి చేశారు.

    ఇవి చదవండి: Hyderabad: ఆ పని చేసిన 24 గంటల్లోనే పోలీసులకు చిక్కిన డ్యాన్స్ మాస్టర్.. అసలేం జరిగిందంటే..

    Horrific Crime: ఇలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు.. భార్య ముఖంపై ముసుగు ధరించలేదని..

    Sad: సాఫీగా సాగిపోయే సంసారం.. ఆ ఒక్క ప్రశ్న వారి జీవితాలను తలకిందులు చేసింది..

    దీంతో కనిమొళి విష పదార్థం కలిపిన విషయం వెలుగుచూడలేదు. అయితే మామను చంపిన విషయాన్ని కనిమొళి భరించలేకపోయింది. అపరాధ భావంతో బాధపడిన కనిమొళి గురువారం ఈ విషయాన్ని గ్రామ పరిపాలన అధికారికి వద్దకు వెళ్లి.. తన చేసిన నేరాన్ని అంగీకరించింది. దీంతో అతడు కీలాతువల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు విచారణ జరిపిన పోలీసులు.. మృతుడి కోడలు కనిమొళిని అరెస్ట్ చేశారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    Tags: Crime news, Tamil nadu

    తదుపరి వార్తలు