దోశ పిండిలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..

వేరొకరి మోజులో పడ్డ భార్య.. భర్తను వదిలించుకునేందుకు ఏకంగా దోశపిండిలో నిద్ర మాత్రలు కలిపి, వాటిని తినిపించి చంపేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

news18-telugu
Updated: October 17, 2019, 9:00 AM IST
దోశ పిండిలో నిద్ర మాత్రలు కలిపి.. ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వేరొకరి మోజులో పడ్డ భార్య.. భర్తను వదిలించుకునేందుకు ఏకంగా దోశపిండిలో నిద్ర మాత్రలు కలిపి, వాటిని తినిపించి చంపేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అక్కడి పుజాల్ పట్టణానికి చెందిన అనుప్రియ(23), సురేష్‌కు 2014లో పెళ్లైంది. వీరిద్దరికి నాలుగేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. సురేష్ మటన్ షాపులో పనిచేస్తుండగా, అనుప్రియ మెడికల్ స్టోర్‌లో పనిచేస్తోంది. అయితే, గత కొన్ని రోజుల నుంచి అనుప్రియ ఎవరితో నిరంతరం ఫోన్లో మాట్లాడుతోంది, ఛాటింగ్‌తో బిజీగా గడుపుతోంది. దీన్ని గమనించిన భర్త.. ఆమెను మందలించాడు. ఓ సారి చేయి కూడా చేసుకున్నాడు. దీంతో భర్తను ఎలాగైనా వదిలించుకోవాలని తలచిన ఆ మహిళ.. తన బాయ్‌ఫ్రెండ్ మురసోలి మారన్(22) సాయం తీసుకుంది. అతడితో కలిసి మెడికల్ షాపులో నిద్ర మాత్రలు కొన్నది. వాటిని దోశ పిండిలో కలిపి భర్తకు దోశలు వేసి, తినిపించింది. అతడు అవి తిని నిద్రలోకి జారుకున్నాక మారన్‌ను పిలిపించి ఇద్దరూ కలిసి అతడి గొంతు నులిమి చంపేశారు.

రాత్రి శవం పక్కనే పడుకున్న నిందితురాలు.. ఉదయం పూట లేచి.. తన భర్త చనిపోయాడని స్థానికులకు సమాచారమిచ్చింది. ఫుల్లుగా మందేసి చనిపోయినట్లు నమ్మించసాగింది. పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించగా, ఆమె చెప్పినదానికి పొంతన కలగలేదు. దీంతో శవాన్ని పోస్టుమార్టం చేయించగా.. అసలు నిజం బయటపడింది. నిద్రమాత్రల డోస్ ఎక్కువగా ఉందని తేల్చారు. ఆ మహిళను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా ఆమె నిజం ఒప్పుకుంది. అనుప్రియ, మారన్‌లపై కేసు నమోదు చేసి వారిని కటకటాల్లోకి నెట్టారు.

First published: October 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు