Shocking: కాలేజ్‌కు వెళ్లేటప్పుడు బస్సు కండక్టర్‌తో ప్రేమ.. పెళ్లి కూడా చేసుకున్నారు.. ఎన్నో మలుపులు.. రాత్రి అలా ప్రశ్నించడంతో..

బాలమురుగన్, ప్రసన్న

ఆమె కాలేజ్‌కు ప్రతి రోజు బస్సులో వెళ్లేది.. ఆ సమయంలో బస్సు కండెక్టర్‌గా (Bus Conductor) పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారి పరిచయం కాస్తా ప్రేమగా (Love) మారింది.

 • Share this:
  ఆమె కాలేజ్‌కు ప్రతి రోజు బస్సులో వెళ్లేది.. ఆ సమయంలో బస్సు కండెక్టర్‌గా (Bus Conductor) పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే వారి పరిచయం కాస్తా ప్రేమగా (Love) మారింది. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఎదురించి పెళ్లి చేసుకున్నారు. అయితే వారికి పాప పుట్టిన తర్వాత ఇద్దరు కుటుంబాలు వారిని దగ్గరకు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. అనేక ట్విస్ట్‌లు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ మహిళ.. తన భర్తను కత్తితో పొడిచింది. అడ్డుపడిన అత్తపై కూడా కత్తితో దాడి చేసింది. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని (Tamil Nadu) సేలం జిల్లాలో (Salem District) చోటుచేసుకుంది.

  తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి సమీపంలోని మాసయ్యన్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న బాలచంద్రన్ కొడుకు బాలమురుగన్ (32) ప్రైవేట్ బస్సులో కండెక్టర్ గా పని చేస్తున్నాడు. క్రిష్ణగిరి జిల్లాలోని పారిస్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇలాకియా (26) ప్రైవేట్ కాలేజ్ లో చదువుకోవడానికి బస్సులో వెళ్లి వస్తున్న సమయంలో బాలమురుగన్ పరిచయం అయ్యాడు. కొంతకాలంగా వీరిద్దరు ప్రేమ వ్యవహారం కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లోని పెద్దలకు తెలిసింది. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో బాలమురుగన్, ఇలాకియాను పెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా 2020 ఫిబ్రవరిలో వివాహ బంధంతో (Marriage) ఒకటయ్యారు.

  Peddapalli: మేనబావను ప్రేమించిన యువతి.. కానీ అలా జరిగేసరికి తట్టుకోలేకపోయింది..

  బాల మురుగున్, ఇలాకియా దంపతులకు పాప జన్మించింది. ఆ తర్వాత వారి వివాహ బంధాన్ని ఇరు కుటుంబాలు స్వాగతించాయి. అయితే భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఇలాకియా కొన్ని నెలల క్రితం తన భర్త నుండి విడిపోయి తన బిడ్డతో కృష్ణగిరిలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. భర్త వేధింపులు భరించలేక మహిళా పోలీస్ స్టేషన్‌లో (Women Police Station) ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలమురుగన్‌ను అరెస్ట్ చేశారు. అతను గత కొన్ని వారాల క్రితం జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాడు.

  Honeymoon: పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్‌కు వెళ్లారు.. అక్కడ అలా జరగడంతో మైండ్ బ్లాక్.. చివరకు..


  జైలులో నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలమురుగన్‌తో అతని భార్య ఇలాకియా సంప్రదింపులు జరిగింది. ఈ క్రమంలోనే పెద్దలు కూడా రాజీ కూడా కుదిర్చారు. దీంతో ఇలాకియా భర్తపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంది. బిడ్డతో కలిసి వచ్చి.. భర్త ఇంట్లో ఉండసాగింది. అయితే రాత్రి సమయంలో ఇలాకియా ఫోన్‌లో మాట్లాడటం (Talking On Phone)చూసిన బాలమురుగన్ ఆమెను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే ఇలాకియా.. భర్తపై కత్తితో దాడి చేసింది. అతని ఛాతి భాగంలో పొడిచింది. బాలమురుగన్ అరుపులు విన్న అతని తల్లి జ్యోతి (Jyothi) వెంటనే అక్కడికి చేరుకుంది. అయితే ఇలాకియా ఆమెను నెట్టివేయడంతో ఆమెకు కూడా గాయాలు అయ్యాయి.

  Newly Married Woman: పెళ్లైన రెండు రోజులకే విడాకులు కావాలన్న భార్య.. కాపురం చేయలేనని కోర్టుకు.. అసలేం జరిగిందంటే..

  బాలమురుగన్ అరుపులకు చుట్టుపక్కల వాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. ఇలాకియా చర్యను అడ్డుకుని.. బాలమురుగన్‌ను ఎడప్పాడి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అనంతరం అతడిని మెరుగైన చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలమురుగన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతుంది.

  ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసిన ఎడప్పాడి పోలీసులు ఇలాకియాను అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచి.. సేలం మహిళా జైలుకు తరలించారు. మరోవైపు భర్త మద్యం మత్తులో తనపై దాడి చేసినట్టుగా ఇలాకియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అతడిపై పోలీసులు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే తండ్రి ఆస్పత్రిలో, తల్లి జైలులో ఉండటంతో.. వారి 7 నెలల పాప పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
  Published by:Sumanth Kanukula
  First published: