హోమ్ /వార్తలు /క్రైమ్ /

Shock: ఫుడ్ డెలివరీ బాయ్ ను చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

Shock: ఫుడ్ డెలివరీ బాయ్ ను చెప్పుతో కొట్టిన కానిస్టేబుల్.. ట్విస్ట్ మాములుగా లేదుగా..

స్విగ్గీ డెలివరీ బాయ్ ని కొడుతున్న కానిస్టేబుల్

స్విగ్గీ డెలివరీ బాయ్ ని కొడుతున్న కానిస్టేబుల్

Tamil Nadu: కానిస్టేబుల్ స్విగ్గి డెలీవరీ బాయ్ పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. నడిరోడ్డు మీద అతగాడి మొబైల్ ఫోన్ ను లాక్కొని చెప్పుతో కొట్టాడు.

కొంత మంది పోలీసులు ఏదో సినిమాలో హీరోలుగా ఫీలవుతారు. శాంతి భద్రతలను కాపాడ్సిన వారే ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తారు. కొంత మంది అధికారులు ఇలా చేయటం వలన డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డపేరు వస్తుంది. ఇప్పటికే కొంత మంది పోలీసులు (Police) లంచాలు తీసుకుంటూ, ఫిర్యాదులు ఇవ్వడానికి స్టేషన్ నకు వచ్చిన మహిళలను టార్గెట్ చేసుకుంటున్నారు. బాధితులను తమ కోరికలు తీర్చాలంటూ  (Woman harassment) లైంగికంగా వేధిస్తున్నారు. కొందరు పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తిస్తు.. సామాన్య ప్రజలపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. తమిళనాడులో (Tamil nadu) అమానుషం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన, వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. సింగనల్లూరు పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ (Traffic constable) సతీష్ శుక్రవారం అవినాశి రోడ్డులో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో .. అక్కడ ఒక డెలివరీ చేసే బాయ్ ను (Swiggy delivery boy) పక్కకు తీసుకెళ్లాడు. అతడిని చెంపలమీద విచక్షణ రహితంగా దాడిచేశారు. ఫోన్ తీసి లాక్కున్నాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశాడు. 38 ఏళ్ల మోహన సుందరం గత రెండేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు.

అతను అగ్రిగేటర్ హోటల్ వద్ద ఉన్నప్పుడు శుక్రవారం.. ఒక ప్రైవేటు బస్సు అతివేగంగా వచ్చింది. రెండు ద్విచక్రవాహనాలు, రోడ్డుపై నడుస్తున్న వారిని ఢీకొట్టబోయింది. ఈ క్రమంలో.. బస్సు డ్రైవర్ ను, స్విగ్గీ డెలివరీ బాయ్ రోడ్డుపక్కన ఆపాడు. బస్సును వేగంగా నడిపితే ప్రాణాలు పోతాయని డ్రైవర్ కు తెలిపారు. అయితే, కొంత సేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇంతలో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ , సతీష్ అక్కడికి వచ్చాడు. స్విగ్గీ డెలివరీ బాయ్ మోహన సుందరాన్ని బూతులు తిడుతూ, విచక్షణ రహితంగా కొట్టాడు. రోడ్డుపైన ఏదైన జరిగితే తాము చూసుకుంటామని నోటికొచ్చినట్లు తిట్టాడు. బస్సు ఎవరిదో తెలుసా.. అంటూ మోహన సుందరాన్ని బెదిరించాడు. రోడ్డుమీద ట్రాఫిక్ జామ్ తాము.. చూసుకుంటామని, అది నీపని కాదంటూ, మోహన సుందరాన్ని చితకొట్టాడు.

అయితే, ఈ ఘటనను అక్కడే ఉన్న కొంత మంది రికార్డు చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో  (Social media) పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్ గా (Viral video) మారింది. ఇది ఉన్నతాధికారుల వరకు వెళ్లింది. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. కానిస్టేబుల్, సతీష్ ను కంట్రోల్ రూమ్ కు అటాచ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

First published:

Tags: Crime news, Tamil nadu, Traffic police, Viral Video

ఉత్తమ కథలు