స్కూల్‌లోనే టీచర్ రాసలీలలు.. అది చూసిన పిల్లలు..

విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. స్కూల్‌లో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పాఠశాలలోనే ఆమెతో రాసలీలల్లో మునిగిపోయాడు.

news18-telugu
Updated: September 11, 2019, 1:23 PM IST
స్కూల్‌లోనే టీచర్ రాసలీలలు.. అది చూసిన పిల్లలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడో టీచర్.. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సింది పోయి తానే దారి తప్పాడు. స్కూల్‌లో పనిచేసే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా పాఠశాలలోనే ఆమెతో రాసలీలల్లో మునిగిపోయాడు. అది తెలిసిన గ్రామస్తులు ఆ టీచర్‌ను చితకబాది, పాఠశాల హెడ్ మాస్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బుధన్‌సంత సమీపంలోని ఉడుపత్తి ప్రాథమిక పాఠశాలలో శరవణన్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. పాఠశాల ప్రాంగణంలోనే అంగన్ వాడీ ఆర్గనైజర్‌గా పనిచేస్తున్న జయంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పాఠశాల ప్రాంగణంలోనే కామక్రీడలో మునిగిపోయారు. అది చూసిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు అతడ్ని పట్టుకుని చితక్కొట్టారు. స్కూల్ హెడ్‌మాస్టర్ కు ఫిర్యాదు చేశారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>