పెళ్లి జరిగి ఏడాది కూడా కాలేదు.. అంతలోనే తీవ్ర విషాదం.. అసలేం జరిగిందంటే..

హత్యకు గురైన భువనేశ్వరి

భర్త మాటలు పట్టించుకోని భువనేశ్వరి.. బావతో ఫోన్‌లో మాట్లాడం కొనసాగిస్తూనే ఉంది. ఇది కాస్తా నిత్యానందన్, భువనేశ్వరిల మధ్య గొడవలకు కారణమైంది.

 • Share this:
  భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. బావతో ఫోన్ మాట్లాడం నచ్చని అతడు ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. వివరాలు.. చెన్నైలోని కిండికి చెందిన నిత్యానందన్‌ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భువనేశ్వరితో ఏడు నెలల కిందట వివాహం జరిగింది. అయితే భువనేశ్వరి తరుచూ ఫోన్‌లో ఆమె బావతో ఫోన్‌లో మాట్లాడేది. దీంతో నిత్యానందన్.. భువనేశ్వరి ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడంపై భువనేశ్వరిని హెచ్చరించాడు. అలా ఫోన్‌లో మాట్లాడటం తనకు నచ్చడం లేదని తెలిపారు. ఫోన్‌ మాట్లాడటం మానేయాలని కోరాడు.

  అయితే భర్త మాటలు పట్టించుకోని భువనేశ్వరి.. బావతో ఫోన్‌లో మాట్లాడం కొనసాగిస్తూనే ఉంది. ఇది కాస్తా నిత్యానందన్, భువనేశ్వరిల మధ్య గొడవలకు కారణమైంది. కొద్ది రోజుల క్రితం భువనేశ్వరి ఫోన్‌లో మాట్లాడటం చూసిన నిత్యానందన్‌ ఆమెతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే భువనేశ్వరిపై కోపాన్ని పెంచుకున్న నిత్యానందన్.. ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత భువనేశ్వరి సోదరుడికి ఫోన్ చేసి.. ఆమెను హత్య చేసినట్టు చెప్పాడు. అనంతరం కిండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

  ఇక, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భువనేశ్వరి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులో నిత్యానందన్, భువనేశ్వరి సోదరుడు ఇద్దరు ఫ్రెండ్స్. దీంతో తన ఫ్రెండ్ సోదరినే నిత్యానందన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే చివరకు ఈ వివాహ బంధం విషాదంగా మిగిలింది.
  Published by:Sumanth Kanukula
  First published: